వెస్టిండీస్‌ టూర్‌ మ్యాచ్‌లూ జియో సినిమాలోనే...

టీమిండియా త్వరలోనే వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లనుంది. వెస్టిండీస్‌తో టెస్ట్‌, వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే..

By Srikanth Gundamalla  Published on  14 Jun 2023 12:10 PM GMT
West Indies Tour, India, Team India, Jio Cinema, Streaming

వెస్టిండీస్‌ టూర్‌ మ్యాచ్‌లూ జియో సినిమాలోనే... 

టీమిండియా త్వరలోనే వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లనుంది. వెస్టిండీస్‌తో టెస్ట్‌, వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లను ప్రసారం చేసే హక్కులను జియో సినిమానే సొంతం చేసుకుంది.

జియో సినిమా ఈ మధ్య కాలంలో అందుబాటులోకి వచ్చింది. ఐపీఎల్‌ సీజన్‌-2023 ప్రసారాల హక్కులను జియో సినిమా దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించేందుకు అవకాశం కల్పించింది. దీంతో.. దీనికి అభిమానులు పెరిగిపోయారు. టీమిండియా వెస్టిండీస్‌ టూర్‌ మ్యాచ్‌ల ప్రసారాలను కూడా జియో సినిమా క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్‌ ప్రసార హక్కులను జియో సినిమా దక్కించుకున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్‌ 18 వెల్లడించింది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లకు నెలకు పైగా సాగనున్నాయి. వీటన్నింటినీ జియో సినిమా ప్రసారం చేయనుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, భోజ్‌పురీ, పంజాబీ, తమిళం, కన్నడ భాషల్లో కామెంటరీ వినిపిస్తున్నారు.

జులై 12 నుంచి ఆగస్టు 13 వరకు వివిధ ఫార్మాట్లలో వెస్టిండీస్‌తో టీమిండియా తలపడనుంది. 12 నుంచి 16 తేదీల మధ్య తొలి టెస్టు, 20 నుంచి 24 తేదీ రకు రెండు టెస్టు జరగనుంది. జులై 27, 29, ఆగస్టు 1వ తేదీల్లో రెండు జట్ల మధ్య మూడు వన్డేలు జరుగుతాయి. ఇక ఆగస్టు 3, 6, 8, 12, 13 తేదీల్లో ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.వెస్టిండీస్‌తో జరగనున్న ఈ మ్యాచ్‌లకు భారత్‌ ఇంకా జట్టును ప్రకటించాల్సి ఉంది. ఐపీఎల్‌ ద్వారా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ద్వారా జియో సినిమా అభిమానులను మూటగట్టుకుంది. అంతేకాక ప్రసారాలు ఫ్రీగా అందించడం ద్వారా ఓ బెంచ్‌మార్క్‌ను క్రియేట్‌ చేసింది. ఇప్పుడు వెస్టిండీస్‌-భారత్‌ మ్యాచ్‌ల ద్వారా సరికొత్త రికార్డులను నమోదు చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. వెస్టిండీస్‌ టూర్‌కు సంబంధించిన మ్యాచ్‌లను కూడా జియోసినిమా ఉచితంగానే అందిస్తుందని సమాచారం. ఐపీఎల్‌ ద్వారా మొత్తం 12 కోట్ల యూనిక్‌ వ్యూయర్స్‌ను సొంతం చేసుకుంది జియోసినిమా. ఫైనల్‌ మ్యాచ్‌లో అయితే ఏకంగా 3.21 కోట్ల మంది వీక్షించడంతో నయా రికార్డుని క్రియేట్‌ చేసింది. మరోసారి తన రికార్డుని తానే బద్దలు కొట్టేందుకు జియో సినిమా సిద్ధమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story