బ్యాంకు లోన్లు, తీసుకున్న లేదా తీసుకునేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బిగ్ షాక్ ఇచ్చింది. దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం (జూలై 15) నుంచి అమల్లోకి వచ్చేలా దాని బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR)ని 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇవాళ్టి నుంచే ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. పెంపు తర్వాత ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానించబడిన రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది.
దీంతో వెహికల్, హోమ్ లోన్‌లు తీసుకున్నవారిపై భారం పడనుంది. ఒక రోజు ఎంసీఎల్‌ఆర్‌కు 8.1 శాతం, నెలకు 8.35 శాతం, 3 నెలలకు 8.4 శాతం, 6 నెలలకు 8.75 శాతం, ఏడాదికి 8.85 శాతం, రెండేళ్లకు 8.95 శాతం, మూడేళ్లకు 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక బేసిస్ పాయింట్ అంటే.. 0.01 శాతం పాయింట్. జూన్‌లో ప్రకటించిన 10 బేసిస్ పాయింట్ల పెంపు తర్వాత SBI రేట్లు పెంచడం ఇది వరుసగా రెండోసారి.