రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. నేటి నుంచి మార్చి 1 వరకు పలు రైళ్లు రద్దు
South Central Railway cancelled some trains from Today.రైల్వే ప్రయాణీకులకు అలర్ట్. కాచిగూడ, గుంటూరు, తిరుపతికి
By తోట వంశీ కుమార్
రైల్వే ప్రయాణీకులకు అలర్ట్. కాచిగూడ, గుంటూరు, తిరుపతికి మధ్య రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. మరమ్మతు పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాన్-ఇంటర్‌లింకింగ్ పనుల వల్ల నిర్ణయించిన రోజుల్లో ఆరు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాకిక్షంగా రద్దు చేశారు.
వివరాలు ఇవే..
* గుంటూరు - కాచిగూడ(17251) ట్రైన్‌ను ఈ నెల 12 నుంచి 28 వరకు, కాచిగూడ-గుంటూరు(17252) రైలును 13 నుంచి వచ్చే నెల మార్చి 1వరకు రద్దు చేశారు.
* మచిలీపట్నం-కర్నూలు సిటీ(ట్రైన్ నెంబర్ 07067) రైలును ఈ నెల 14, 16,18, 21,23,25,28వ తేదీలలో రద్దు చేయగా, కర్నూలు సిటీ-మచిలీపట్నం(07068) ట్రైన్‌ను ఈ నెల 15,17,19,22,24,26తో పాటు మార్చి 1 వరకు రద్దు చేశారు.
* కాచికూడ-మెదక్(07577) ట్రైన్ 13 నుంచి మార్చి 1వరకు, మెదక్-కాచిగూడ(07578) ట్రైన్ 13 నుంచి మార్చి 1వ తేదీ వరకు రద్దు చేశారు.
* గుంటూరు-డోన్(17228) రైలును ఈ నెల 12 నుంచి 28వరకు, డోన్-గుంటూరు(17227) రైలును 13 నుంచి మార్చి 1 వరకు రద్దు చేశారు.
Cancellation/Partial Cancellation of Trains @drmgtl @drmhyb @drmgnt pic.twitter.com/8upoi4CB2d
— South Central Railway (@SCRailwayIndia) February 11, 2023
* గుంటూరు-సికింద్రాబాద్(17253) ట్రైన్‌ను 19 నుంచి 28 వరకు గుంటూరు-దొనకోండ మధ్య, సికింద్రాబాద్-గుంటూరు(17254) రైలును 18వ తేదీ నుంచి 27 వరకు దొనకోండ-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
* గుంటూరు-తిరుపతి(17261) ట్రైన్‌ను 19 నుంచి 28 వరకు గుంటూరు-మార్కాపురం మధ్య పాక్షికంగా రద్దు చేశారు. అలాగే తిరుపతి-గుంటూరు(17262) మధ్య రోజూ సర్వీసులు అందించే ట్రైన్‌ను ఈ నెల 18 నుంచి 27వ తేదీ వరకు మార్కాపురం-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
* రేపల్లె-మార్కాపురం(07889) ట్రైన్‌ను 12 నుంచి 28 వరకు గుంటూరు-మార్కాపురం మధ్య పాక్షికంగా రద్దు చేశారు. మార్కాపురం-తెనాలి(07890) రైలును 12 నుంచి 28 వరకు మార్కాపురం-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని కోరారు.