యూపీఐతో పొరపాటున డబ్బు వేరేవారికి పంపారా? అయితే ఇలా చేయండి

మన దేశంలో యూపీఐ లావాదేవీలు బాగా పెరిగాయి. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేయడానికైనా చాలా మంది ఈ పద్ధతినే ఉపయోగిస్తున్నారు.

By అంజి  Published on  18 Nov 2024 9:29 AM IST
money, UPI, NPCI, Bank

యూపీఐతో పొరపాటున డబ్బు వేరేవారికి పంపారా? అయితే ఇలా చేయండి

మన దేశంలో యూపీఐ లావాదేవీలు బాగా పెరిగాయి. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేయడానికైనా చాలా మంది ఈ పద్ధతినే ఉపయోగిస్తున్నారు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా తప్పు ఫోన్‌ నంబర్లకు యూపీఐ ద్వారా డబ్బులు చెల్లిస్తుంటాం. అలాంటి సమయంలో మన డబ్బును తిరిగి ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు.. పేమెంట్‌ను రివర్స్‌ చేసి మీ డబ్బను తిరిగి పొందొచ్చు. కాకపోతే దీనికి మీరు వీలైనంత త్వరగా రెస్పాండ్‌ కావాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ముందుగా సంబంధిత బ్యాంకు అధికారిని లేదా సర్వీస్‌ ప్రొవైడర్‌ను సంప్రదించాలి. ఒకవేళ వారికి మీ చెల్లింపును రివర్స్‌ చేయడం వీలుకాకపోతే.. యూపీఐ సిస్టమ్‌ను కంట్రోల్‌ చేసే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను సంప్రదించాలి.

అక్కడ మీ డబ్బును వెనక్కు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే, ఇక్కడ కూడా మీ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుందని కచ్చితంగా చెప్పలేము. అవతలివైపు వారు మీ ట్రాన్సాక్షన్‌ను ఆమోదించినా, ఆ డబ్బును ఇతర ఖాతాలకు బదిలీ చేసుకున్నా.. మీ డబ్బులు తిరిగి పొందే అవకాశం క్షీణిస్తుంది. అందుకే యూపీఐ ద్వారా లావాదేవీలు నిర్వహించేటప్పుడు ఫోన్‌ నంబర్‌, పేరు ఇవన్నీ సరిగ్గా చెక్‌ చేసుకోవాలి.

Next Story