లోన్లు తీసుకున్నవారికి ఎస్‌బీఐ గుడ్‌న్యూస్
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది.
By అంజి Published on 15 Feb 2025 3:10 PM IST
లోన్లు తీసుకున్నవారికి ఎస్‌బీఐ గుడ్‌న్యూస్
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. నేటి నుంచి రెపో రేటను 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, రిటైల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గినట్టు తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునేవారికి ఇది మంచి అవకాశం అని పేర్కొంది. ఎంసీఎల్‌ఆర్, బీపీఎల్‌ఆర్ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది.
భారతదేశంలో అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గృహ రుణాలతో సహా వివిధ రుణాలకు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR) లను ఇటీవల తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన రుణ రేట్లు నేటి నుండి అమల్లోకి వస్తాయి. గత వారం జరిగిన ఎంపీసీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే.. ఎస్‌బీఐతో పాటు, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు తమ రుణ రేట్లను సవరించాయి.