ఎస్బీఐ.. మిస్డ్ కాల్ ఇస్తే లోన్ ఇచ్చేస్తుందట

SBI personal loan is just a missed call. ఎస్బీఐ ఎక్స్‌ప్రెస్ ప‌ర్స‌న‌ల్ లోన్ పొంద‌టానికి ఒక `మిస్డ్‌ కాల్` లేదా ఒక `ఎస్ఎంఎస్` స‌రిపోతుందని సంస్థ చెబుతోంది.

By Medi Samrat  Published on  17 Feb 2021 5:21 PM IST
SBI personal loan is just a missed call

పర్సనల్ లోన్ ల కోసం ఎన్నో బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాంటి వారి కోసం తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సరికొత్తగా కొత్త ప్రణాళికతో ముందుకు వస్తోంది. ఎస్బీఐ ఎక్స్‌ప్రెస్ ప‌ర్స‌న‌ల్ లోన్ పొంద‌టానికి ఒక `మిస్డ్‌ కాల్` లేదా ఒక `ఎస్ఎంఎస్` స‌రిపోతుందని సంస్థ చెబుతోంది. మీకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ..! నిజంగానే ఈ సరికొత్త ఫీచర్ ను ఎస్బీఐ తీసుకుని వచ్చింది. వీలైనంత తక్కువ సమయంలో రుణం అవ‌స‌ర‌మైన వినియోగ‌దారుల‌కు వ్య‌క్తిగ‌త రుణాన్ని అందించనుంది. ఈ రుణం వివాహం, విహార‌యాత్ర‌, ఊహించ‌ని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి, ప్ర‌ణాళిక‌బ‌ద్ద‌మైన కొనుగోలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఎస్బీఐ క‌స్ట‌మ‌ర్లు దాని వెబ్‌సైట్‌లో పేర్కొన్న బ్యాంక్ ఎస్బీఐ యొక్క ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ ప‌ర్స‌న‌ల్ లోన్ ద్వారా క‌నీస డాక్యుమెంటేష‌న్‌తో స‌త్వ‌ర రుణ ఆమోదం పొందొచ్చు. వ్య‌క్తిగ‌త రుణం అవ‌స‌ర‌మైన వారు 7208933145 నెంబ‌ర్‌కు అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంప‌వ‌చ్చని ఎస్బీఐ చెబుతోంది. అంతేకాకుండా 7208933142 నెంబ‌ర్‌కు మిస్డ్‌ కాల్ ఇవ్వవ‌చ్చు అని చెబుతోంది. ఈ ఎస్బీఐ రుణంపై వ‌డ్డీ రేటు 9.6% ఉండనుంది.

ఎస్బీఐ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ ప‌ర్స‌న‌ల్ లోన్ లో రూ. 20 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం ఇవ్వనున్నారు. ముఖ్యంగా త‌క్కువ వ‌డ్డీ రేటు ఉండడంతో పలువురు ఆసక్తి కనబర్చే అవకాశం ఉంది. రుణ బ్యాలెన్స్ పైనే వ‌డ్డీ వేస్తారు. ఇక తక్కువ ప్రాసెసింగ్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. క‌నిష్ట డాక్యుమెంటేష‌న్‌ తో పాటూ.. ఎటువంటి తెలియ‌ని ఖ‌ర్చులుండ‌వు అని ఎస్బీఐ చెబుతోంది. ఈ రుణానికి సెక్యూరిటీ గాని హామిగానీ అవసరం లేదని సంస్థ చెబుతోంది.

ఎస్బీఐ లో శాలరీ ఖాతా ఉన్న వ్య‌క్తుల‌యి ఉండాలని.. క‌నీసం నెల ఆదాయం రూ. 15,000 ఉండాలని చెబుతోంది. సెంట్ర‌ల్‌, స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్‌, పాక్షిక ప్ర‌భుత్వ స‌ర్వీసుల‌యి ఉండాలని అంటున్నారు. సెంట్ర‌ల్ ప‌బ్లిక్ సెక్టార్ యూనిట్స్ మ‌రియు లాభాల‌ను ఆర్జించే రాష్ట్ర ప‌బ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉద్యోగులకు కూడా ఇది వర్తించనుంది. ప్ర‌ముఖ జాతీయ విద్యాసంస్థ‌ల ఉద్యోగులు కూడా ఈ రుణాన్ని పొందవచ్చు. క‌నీస రుణ మొత్తం రూ. 25,000 కాగా.. గ‌రిష్ట రుణ మొత్తం రూ. 20 ల‌క్ష‌లు వరకూ ఇస్తారు.




Next Story