తెలుగు ప్రజలు జరుపుకునే పండుగల్లో సంక్రాంతి అతి పెద్ద పండుగ. కుటుంబ సభ్యులతో ఈ పండగను ఆనందంగా జరుపుకునేందుకు ఎక్కడెక్కడో నివసించే వారు సొంతూళ్లకు వెలుతుంటారు. ఇప్పటికే రెగ్యులర్ రైళ్లల్లో సీట్లు అన్నీ నిండిపోయాయి. వెయిటింగ్ లిస్టు కూడా చాలానే ఉంది. ఈ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త చెప్పింది. అదనపు ట్రైన్స్ నడుపుతున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకుల రద్దీ కారణంగానే అదనపు రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించింది.
ఏఏ రూట్లలో అదనంగా ట్రైన్లు నడువనున్నాయో ఓ సారి చూద్దాం..
ట్రైన్ నెంబర్ 08505
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే సంక్రాంతి స్పెషల్ ట్రైన్. జనవరి 11, 13, 16 తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఆయా రోజుల్లో రాత్రి 7.50 గంటలకు విశాఖపట్నం నుంచి రైలు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ట్రైన్ నెంబర్ 08506
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే స్పెషల్ రైలు ఇది. జనవరి 12, 14, 17 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి 7 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
దువ్వాడ, అన్నవరం, తుని, సామర్లకోట, రాజమండ్రి , ఏలూరు , రాయనపాడు, ఖమ్మం , వరంగల్ , కాజీ పేట వంటి స్టేషన్లలో రైళ్లు ఆగుతాయి. ప్రయాణికులు స్పెషల్ ట్రైన్ టికెట్ బుకింగ్స్‌ను ఈ రోజు నుంచే చేసుకోవచ్చు.