గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌ను విడుదల చేసిన సామ్‌సంగ్ ఇండియా
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ , నేడు వినియోగదారులు తమ తాజా గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 25+ మరియు గెలాక్సీ ఎస్ 25 స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తు ఆర్డర్ చేయవచ్చని ప్రకటించింది,
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Jan 2025 6:45 PM IST
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ , నేడు వినియోగదారులు తమ తాజా గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 25+ మరియు గెలాక్సీ ఎస్ 25 స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తు ఆర్డర్ చేయవచ్చని ప్రకటించింది, ఇవి సామ్‌సంగ్ ఇప్పటివరకు సృష్టించిన అత్యంత సహజమైన మరియు సందర్భోచిత మొబైల్ అనుభవాలతో నిజమైన ఏఐ కంపానియన్‌గా కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తాయి.
గెలాక్సీ ఎస్25 సిరీస్ ఏఐ ఏజెంట్లు మరియు మల్టీమోడల్ సామర్థ్యాలను సజావుగా మిళితం చేయటం ద్వారా ప్రతి టచ్‌పాయింట్‌లో వినియోగదారులు అనుసంధానించే విధానాన్ని మార్చాలనే సామ్‌సంగ్ లక్ష్యంలో మొదటి అడుగును సూచిస్తుంది. గెలాక్సీ చిప్‌సెట్ కోసం మొట్టమొదటిసారిగా అనుకూలీకరించిన స్నాప్ డ్రాగన్ ® 8 ఎలైట్ మొబైల్ ప్లాట్‌ఫామ్ గెలాక్సీ ఏఐ కోసం అత్యున్నత ఆన్-డివైస్ ప్రాసెసింగ్ శక్తిని మరియు గెలాక్సీ యొక్క తదుపరి తరం ప్రో విజువల్ ఇంజిన్‌తో ఉన్నతమైన కెమెరా పరిధి మరియు నియంత్రణను అందిస్తుంది.
“గత సంవత్సరం గెలాక్సీ ఏఐ ని విడుదల చేయటంతో సామ్‌సంగ్ మొబైల్ ఏఐ యుగాన్ని ఆవిష్కరించింది. మేము ఇప్పుడు గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌తో గెలాక్సీ ఏఐ యొక్క తదుపరి అధ్యాయాన్ని తీసుకువచ్చాము, ఇది మీ నిజమైన ఏఐ కంపానియన్. గెలాక్సీ ఎస్25 సిరీస్ మీకు అత్యంత సందర్భోచితమైన, వ్యక్తిగతీకరించిన ఏఐని అందిస్తుంది, తద్వారా మీరు వ్యక్తిగత గోప్యతకు హామీ ఇవ్వబడి, అనుకూలమైన, కార్యాచరణకు తగిన పరిజ్ఙానంను పొందవచ్చు. కొత్త గెలాక్సీ ఎస్25 సిరీస్ మా నోయిడా ఫ్యాక్టరీలో తయారు చేయబడుతుందని వెల్లడించేందుకు నేను సంతోషిస్తున్నాను ”అని సామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా అధ్యక్షుడు మరియు సీఈఓ జె బి పార్క్ అన్నారు.
సామ్‌సంగ్ యొక్క ఏఐ -మొదటి ప్లాట్‌ఫారమ్ అయిన వన్ యుఐ7 తో వచ్చే మొదటి స్మార్ట్‌ఫోన్ సిరీస్, గెలాక్సీ ఎస్25 సిరీస్. ఇది అత్యంత సహజమైన నియంత్రణలను అందించడానికి రూపొందించబడిన ఏఐ -ఆధారిత, వ్యక్తిగతీకరించిన మొబైల్ అనుభవాలను అనుమతిస్తుంది. మల్టీమోడల్ సామర్థ్యాలతో కూడిన ఏఐ ఏజెంట్లు గెలాక్సీ ఎస్ 25 సిరీస్ సహజంగా అనిపించే పరస్పర చర్యల కోసం టెక్స్ట్, ప్రసంగం, చిత్రాలు మరియు వీడియోలను అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి. గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌తో, మీరు తదుపరి దశల కోసం సందర్భోచితమైన సూచనలతో కార్యాచరణ శోధనలను కూడా చేయవచ్చు. అంతేకాకుండా, GIFని పంచుకోవడం లేదా ఈవెంట్ వివరాలను సేవ్ చేయడం వంటి శీఘ్ర తదుపరి చర్యల కోసం యాప్‌ల మధ్య మారడం కూడా సులభంగా జరుగుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు సహజ భాషా అవగాహనలో పురోగతిని కూడా సూచిస్తాయి, రోజువారీ సంభాషణలను సులభతరం చేస్తాయి. సామ్‌సంగ్ గ్యాలరీలో ఒక నిర్దిష్ట ఫోటోను అడగండి మరియు సహజంగా ఆ నిర్దిష్టమైన ఫోటోని కనుగొనండి లేదా సెట్టింగ్‌లలో డిస్‌ప్లే ఫాంట్‌ల పరిమాణాన్ని సర్దుబాటు చేయండి.
జెమినిని యాక్టివేట్ చేయడానికి మరియు సామ్‌సంగ్ , గూగుల్ యాప్‌లతో పాటు స్పాటిఫై వంటి థర్డ్-పార్టీ యాప్‌లలో సజావుగా మారడానికి సైడ్ బటన్‌ను నొక్కి పట్టుకోండి. ఉదాహరణకు, మీకు ఇష్టమైన స్పోర్ట్స్ టీమ్ సీజన్ షెడ్యూల్‌ను కనుగొని, దానిని సామ్‌సంగ్ క్యాలెండర్‌కు జోడించండి - ఒకే ఆదేశంతో !
గెలాక్సీ ఎస్ 25 సిరీస్ కమ్యూనికేషన్, ఉత్పాదకత మరియు సృజనాత్మకత కోసం గెలాక్సీ ఏఐ యొక్క ప్రసిద్ధ సాధనాలకు అప్‌గ్రేడ్‌ల శ్రేణిని తెస్తుంది. గుగూల్ యొక్క సర్కిల్ టు సెర్చ్ ఇప్పుడు మీ స్క్రీన్‌పై ఫోన్ నంబర్‌లు, ఇ- మెయిల్ మరియు యుఆర్ఎల్ లను త్వరగా గుర్తిస్తుంది. మీ కాల్‌లు కాల్ ట్రాన్స్‌క్రిప్ట్ మరియు సారాంశంతో నిర్వహించబడతాయి. రైటింగ్ అసిస్ట్‌తో, మీరు కంటెంట్‌ను సంగ్రహించవచ్చు లేదా గమనికలను స్వయంచాలకంగా ఫార్మాట్ చేయవచ్చు. డ్రాయింగ్ అసిస్ట్ స్కెచ్‌లు, టెక్స్ట్ లేదా ఇమేజ్ ప్రాంప్ట్‌ల కలయికల ద్వారా ఆలోచనలకు ప్రాణం పోసుకోవడానికి కొత్త మార్గాలను అన్‌లాక్ చేస్తుంది.
గోప్యత కాపాడుతూ అత్యున్నత -వ్యక్తిగతీకరించిన అనుభవాలు
గెలాక్సీ ఎస్ 25 సిరీస్ మీ ప్రాధాన్యతలను మరియు వినియోగ నమూనాలను ప్రతిబింబించే అత్యంత అనుకూలీకరించిన అనుభవాలను అందించడానికి పరికరంలో మీ డేటాను సురక్షితంగా విశ్లేషించడం ద్వారా వ్యక్తిగతీకరించిన ఏఐ ఫీచర్ల కోసం వ్యక్తిగత డేటా ఇంజిన్‌తో వస్తుంది. ఈ పరిజ్ఙానం సహజ భాషను ఉపయోగించి గ్యాలరీలో పాత ఫోటో కోసం శోధించడం లేదా లాక్ స్క్రీన్‌లో నౌ బార్ 8 ద్వారా ముందస్తుగా యాక్సెస్ చేయగల సూచనలను అందించే నౌ బ్రీఫ్ తో రోజంతా మార్గనిర్దేశం చేయడం వంటి అనుకూలీకరించిన అనుభవాలను ప్రారంభిస్తాయి.
వ్యక్తిగతీకరించిన డేటా అంతా నాక్స్ వాల్ట్ ద్వారా గోప్యంగా ఉంచబడుతుంది మరియు భద్రపరచబడుతుంది. పోస్ట్-క్వాంటం క్రిప్టోగ్రఫీని కూడా గెలాక్సీ ఎస్ 25 పరిచయం చేస్తుంది, క్వాంటం కంప్యూటింగ్ అభివృద్ధి చెందుతున్నప్పుడు పెరిగే ముప్పుల నుండి వ్యక్తిగత డేటాను కాపాడుతుంది.
గెలాక్సీ ఎస్ 25 సిరీస్ అత్యంత శక్తివంతమైన గెలాక్సీ
గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్నాప్డ్రాగన్ ® 8 ఎలైట్ ద్వారా శక్తిని పొందుతుంది - ఇది గెలాక్సీ ఎస్ సిరీస్‌లో ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్, ఇది మునుపటి తరంతో పోలిస్తే NPUలో 40%, సిపియు లో 37% మరియు జీపీయు లో 30% పనితీరును పెంచుతుంది. ప్రో స్కెలర్ డిస్ప్లే ఇమేజ్ స్కేలింగ్ నాణ్యతలో 40% మెరుగుదలను సాధించడంలో సహాయపడుతుంది, అదే సమయంలో సామ్‌సంగ్ యొక్క మొబైల్ డిజిటల్ నేచురల్ ఇమేజ్ ఇంజిన్ (mDNIe)తో కస్టమ్ టెక్నాలజీని కలుపుతూ గెలాక్సీ ఐపి ని ఉపయోగించి ప్రాసెసర్‌లో పొందుపరచబడి ఎక్కువ డిస్ప్లే పవర్ సామర్థ్యాన్ని అందిస్తుంది. వల్కాన్ ఇంజిన్ మరియు మెరుగైన రే ట్రేసింగ్ సున్నితమైన మరియు మరింత వాస్తవిక మొబైల్ గేమింగ్‌ను అందిస్తుంది.
40% పెద్ద ఆవిరి గది మరియు అనుకూలీకరించిన థర్మల్ సామర్థ్యంలో అదనపు మెరుగుదలను అందించే టైలర్డ్ థర్మల్ ఇంటర్‌ఫేస్ మెటీరియల్ (TIM)తో మారిన హీట్ డిస్సిపేషన్ స్ట్రక్చర్ కారణంగా అన్ని తీవ్రమైన పరికర వినియోగం మరియు ఏఐ ప్రాసెసింగ్ సజావుగా నడుస్తాయి.
గెలాక్సీ ఎస్ 25 సిరీస్ అసలైన ప్రో క్రియేషన్‌ను తీసుకువస్తుంది
గెలాక్సీ ఎస్ 25 సిరీస్ హై రిజల్యూషన్ సెన్సార్‌లు మరియు ప్రోవిజువల్ ఇంజిన్‌తో ప్రతి శ్రేణిలో అల్ట్రా-డిటైల్డ్ షాట్‌లను అందిస్తుంది, ఇది మొబైల్ ఫోటోగ్రఫీకి కొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తుంది. మునుపటి 12ఎంపీ నుండి అప్‌గ్రేడ్ చేయబడిన కొత్త 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా సెన్సార్‌తో, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా అసాధారణమైన స్పష్టత మరియు ఉత్సాహాన్ని అందిస్తుంది. 10-బిట్ HDR రికార్డింగ్ ఇప్పుడు డిఫాల్ట్‌గా వర్తించబడుతుంది, 8-బిట్‌తో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ రంగు వ్యక్తీకరణను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఏ లైటింగ్ పరిస్థితుల్లోనైనా వివరాలను సంగ్రహించగలవు. అంతేకాకుండా, తక్కువ-కాంతి వీడియోలు గెలాక్సీ ఎస్ 25 సిరీస్ కంటే ఎప్పుడూ స్పష్టంగా లేవు.
గెలాక్సీ ఎస్ 25 సిరీస్ వీడియోలలో అవాంఛిత శబ్దాన్ని తొలగించడానికి ఆడియో ఎరేజర్‌తో వస్తుంది. మొబైల్‌లో DSLR-వంటి అనుభవం కోసం, ఈ ఫోన్‌లు ప్రసిద్ధ ఎక్స్‌పర్ట్ RAWకి అనుసంధానించబడిన వర్చువల్ ఎపర్చర్‌తో డెప్త్-ఆఫ్-ఫీల్డ్ నియంత్రణను అందిస్తాయి. గెలాక్సీ ఎస్ 25 సిరీస్ గెలాక్సీ లాగ్ తో సినిమాటిక్ సృజనాత్మకతను కూడా పెంచుతుంది, మరింత ప్రొఫెషనల్ వీడియో ఉత్పత్తి కోసం ఖచ్చితమైన కలర్ గ్రేడింగ్ ఎంపికలను అనుమతిస్తుంది.
పోర్ట్రైట్ స్టూడియో కూడా మెరుగుపరచబడింది, వినియోగదారులు మరింత నిజమైన ముఖ కవళికలతో వ్యక్తిగతీకరించిన అవతార్‌లను సృష్టించడానికి అనుమతిస్తుంది. ఫిల్టర్లు కొత్త అనలాగ్-శైలి ఫిల్టర్‌లను పరిచయం చేస్తాయి, వారి ఫోటోలు మరియు వీడియోల కోసం ఫిల్మ్-లాంటి సౌందర్యాన్ని అందిస్తాయి.
మన్నికైన డిజైన్
గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ఇప్పటివరకు అత్యంత సన్నని, తేలికైన మరియు అత్యంత మన్నికైన గెలాక్సీ ఎస్ సిరీస్. ఇది మన్నికైన టైటానియం మరియు కొత్త కార్నింగ్® గొరిల్లా® ఆర్మర్ 2 ను కలిగి ఉంది. గెలాక్సీ ఎస్ 25+ మరియు ఎస్ 25 యొక్క ప్రతి బాహ్య భాగం ఇప్పుడు కనీసం ఒక రీసైకిల్ చేయబడిన పదార్థాన్ని కలిగి ఉంది, ఎందుకంటే వాటి మెటల్ ఫ్రేమ్ మొదటిసారిగా రీసైకిల్ చేయబడిన ఆర్మర్ అల్యూమినియంను కలిగి ఉంటుంది. ఏడు తరాల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు మరియు ఏడు సంవత్సరాల భద్రతా నవీకరణలతో కలిపి, గెలాక్సీ ఎస్ 25 సిరీస్ సుదీర్ఘ జీవితకాలంలో నమ్మకమైన మరియు ఆప్టిమైజ్ చేయబడిన పనితీరును నిర్ధారిస్తుంది.
ధర మరియు లభ్యత
గెలాక్సీ ఎస్ 25 సిరీస్ కోసం ముందస్తు ఆర్డర్ జనవరి 23 నుండి అన్ని ప్రముఖ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలలో ప్రారంభమవుతుంది. వినియోగదారులు ఈరోజు నుండి సామ్‌సంగ్ లైవ్‌లో https://www.samsung.com/in/live-offers/ వద్ద గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌ను ముందస్తు ఆర్డర్ చేయవచ్చు.
Samsung.com ద్వారా గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ను కొనుగోలు చేసే వినియోగదారులు మూడు ప్రత్యేకమైన రంగుల - టైటానియం జేడ్ గ్రీన్ , టైటానియం జెట్ బ్లాక్ & టైటానియం పింక్ గోల్డ్ - నుండి ఎంచుకునే అవకాశాన్ని కూడా పొందుతారు. Samsung.com నుండి గెలాక్సీ ఎస్ 25 మరియు ఎస్ 25 ప్లస్ కొనుగోలు చేసే వారికి బ్లూబ్లాక్, కోరల్రెడ్ & పింక్‌గోల్డ్ అనే మూడు ప్రత్యేకమైన రంగుల ఎంపిక కూడా లభిస్తుంది.
ప్రీ-ఆర్డర్ ఆఫర్లు
గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ను ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్లకు రూ. 21000 విలువైన ప్రీ-ఆర్డర్ ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ. 12000 విలువైన స్టోరేజ్ అప్‌గ్రేడ్ ఉంటుంది, దీనిలో కస్టమర్‌లు 12జిబి 256జిబి వేరియంట్ ధరకు 12జిబి 512జిబి వేరియంట్‌ను పొందగలరు; రూ. 9000 అప్‌గ్రేడ్ బోనస్‌తో పాటు. ప్రత్యామ్నాయంగా, 9 నెలల నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌తో గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ను కొనుగోలు చేసినప్పుడు కస్టమర్‌లు రూ. 7000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
గెలాక్సీ ఎస్ 25+ను ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్‌లు రూ. 12000 విలువైన ప్రయోజనాలను పొందుతారు, దీని కింద కస్టమర్‌లు 12జిబి 256 జిబి వేరియంట్ ధరకు 12జిబి 512జిబి వేరియంట్‌ను పొందగలరు. అదే సమయంలో, గెలాక్సీ ఎస్ 25ను ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్‌లు అప్‌గ్రేడ్ బోనస్‌గా రూ. 11000 విలువైన ప్రయోజనాలను పొందుతారు. ప్రత్యామ్నాయంగా, 9 నెలల నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌తో గెలాక్సీ ఎస్ 25ను కొనుగోలు చేసినప్పుడు కస్టమర్‌లు రూ. 7000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. గెలాక్సీ ఎస్ 25 మరియు గెలాక్సీ ఎస్ 25+ రెండింటికీ అన్ని ప్రముఖ NBFCల ద్వారా 24 నెలల ఉచిత ఈఎంఐ పొందే అవకాశాన్ని కూడా సామ్‌సంగ్ కస్టమర్లకు అందిస్తోంది.