రష్యాకు ఫోన్‌లు, చిప్‌ల సరఫరా నిలిపివేత.. ఉక్రెయిన్‌కు సామ్‌సంగ్‌ మానవతా సాయం

Samsung suspends shipments of phones, chips to Russia. గత వారం నుండి ఉక్రెయిన్‌పై రష్యా దేశం తన దాడి కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే రష్యా దేశంలో అమ్మకాలు, సేవలను నిలిపివేస్తున్నట్లు

By అంజి  Published on  5 March 2022 3:36 AM GMT
రష్యాకు ఫోన్‌లు, చిప్‌ల సరఫరా నిలిపివేత.. ఉక్రెయిన్‌కు సామ్‌సంగ్‌ మానవతా సాయం

గత వారం నుండి ఉక్రెయిన్‌పై రష్యా దేశం తన దాడి కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే రష్యా దేశంలో అమ్మకాలు, సేవలను నిలిపివేస్తున్నట్లు ఆపిల్ నుండి మైక్రోసాఫ్ట్ వరకు పెద్ద పెద్ద కంపెనీలు ప్రకటించాయి. అయితే తాజాగా ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా రష్యాకు ఉత్పత్తి సరుకులను నిలిపివేసినట్లు సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ తెలిపింది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్‌ సంక్లిష్ట పరిస్థితిని చురుకుగా పర్యవేక్షిస్తోందని.. కంపెనీ బ్లూమ్‌బెర్గ్‌కు ఇమెయిల్ చేసిన ప్రకటనలో తెలిపింది. రష్యాకు చిప్‌ల నుండి స్మార్ట్‌ఫోన్‌లు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని శామ్‌సంగ్ ఉత్పత్తుల ఎగుమతులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయని ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తి తెలిపారు.

"మా ఆలోచనలు ప్రభావితమైన ప్రతి ఒక్కరితో ఉంటాయి. మా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరి భద్రతను నిర్ధారించడం మా ప్రాధాన్యత" అని సామ్‌సంగ్‌ ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్‌ యుద్ధ ప్రాంతంలో మానవతా సాయం కోసం ఒక మిలియన్ల వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులతో సహా 6 మిలియన్ల యూఎస్‌ డాలర్లను విరాళంగా అందిస్తోంది సామ్‌సంగ్‌.

ఇదిలా ఉంటే.. ఈయూ, యూఎస్‌, యూకేలు రష్యా దేశాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా ఒంటరి చేసే ప్రయత్నంలో విస్తృతమైన ఆంక్షల జాబితాను రూపొందించాయి. యుద్ధం గురించిన ఆందోళనలకు మించి, రష్యాలో కార్యకలాపాలు నిర్వహించడం బయటి కంపెనీలకు సవాలుగా మారింది. మైక్రోసాఫ్ట్ శుక్రవారం ఉక్రెయిన్‌పై రష్యా యొక్క "అన్యాయమైన, చట్టవిరుద్ధమైన దాడిని" ఖండించింది. రష్యాలో అన్ని కొత్త ఉత్పత్తులు, సేవల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. యాపిల్‌ ఐఫోన్‌ సంస్థ కూడా విక్రయాలను నిలిపివేసింది. రష్యాలో యాపిల్‌ పే సేవలు, ఇతర ప్రసిద్ధ ఉత్పత్తులను పరిమితం చేయడం ప్రారంభించింది. రష్యాకు పీసీల యొక్క అతిపెద్ద సరఫరాదారు హెచ్‌పీ, ఇంటెల్ ఎగుమతులను నిలిపివేసింది.

Next Story