మార్కెట్‌లోకి రెడ్ మీ నుండి రెండు స‌రికొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. వివ‌రాలివిగో..

Redmi Note 11 and Note 11S launch in India. Redmi Note 11, Note 11S స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్ లోకి వచ్చాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Feb 2022 8:56 AM GMT
మార్కెట్‌లోకి రెడ్ మీ నుండి రెండు స‌రికొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. వివ‌రాలివిగో..

Redmi Note 11, Note 11S స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్ లోకి వచ్చాయి. ఒకే రకమైన డిజైన్ తో వచ్చినా ఇంటర్నల్‌ గా కొన్ని తేడాలు ఉన్నాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లను పరిశీలిస్తే.. నోట్ 11లో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉండగా.. నోట్ 11ఎస్‌లో మీడియాటెక్ చిప్‌సెట్‌ని ఉపయోగించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, రెడ్‌మీ సంస్థ రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో స్మార్ట్‌వాచ్, రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43ని కూడా ప్రకటించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, నోట్ 10 సిరీస్ మాదిరిగానే 5G కనెక్టివిటీని కలిగి లేవు. నోట్ 11 మొబైల్ Motorola Moto G51, Realme 9i, Infinix Note 11S వంటి వాటితో పోటీపడుతుంది. Note 11S వేరియంట్ Samsung Galaxy M32, Realme Narzo 30 Pro, Infinix Note 10 Proకి పోటీగా నిలుస్తుంది. ఈ మొబైల్ ఫోన్ మిడ్-బడ్జెట్ పరిధిలోకి వస్తాయి.

Redmi Note 11 స్పెసిఫికేషన్స్

Redmi Note 11 1,080 x 2,400 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.43-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే పంచ్ హోల్‌తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC నోట్ 11తో వస్తుంది. గరిష్టంగా 6GB వరకు LPDDR4X RAM మరియు 128GB వరకు నిల్వ ఉంటుంది. నోట్ 11లోని కెమెరా సెటప్ f/1.8 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంది. అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన సెకండరీ 8-మెగాపిక్సెల్ సెన్సార్, డెప్త్-మాక్రో షాట్‌ల కోసం 2-మెగాపిక్సెల్ సెన్సార్‌లు ఉన్నాయి. నోట్ 11లోని ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 13-మెగాపిక్సెల్ సెన్సార్‌ని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 11లో రన్ అయ్యే MIUI 13 స్కిన్‌తో వస్తుంది. నోట్ 11లో అందించబడిన సెన్సార్ల ప్యాక్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో భాగంగా 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్ అందించబడ్డాయి. నోట్ 11లోని బ్యాటరీ 5,000mAh తో వస్తుంది, ఇది 33W ప్రో ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Redmi Note 11S స్పెసిఫికేషన్స్

Redmi Note 11S 1,080 x 2,400 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.43-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే పంచ్ హోల్‌తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఆక్టా-కోర్ MediaTek Helio G96 SoC నోట్ 11Sకి పవర్‌ని అందిస్తుంది. గరిష్టంగా 6GB వరకు LPDDR4X RAM, 128GB వరకు నిల్వ ఉంటుంది. నోట్ 11Sలో కెమెరా సెటప్ f/1.9 ఎపర్చర్‌తో 108-మెగాపిక్సెల్ Samsung HM2 ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంది. అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన సెకండరీ 8-మెగాపిక్సెల్ సెన్సార్, డెప్త్, మాక్రో షాట్‌ల కోసం 2-మెగాపిక్సెల్ సెన్సార్‌లు ఉన్నాయి. నోట్ 11Sలో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం f/2.4 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 11లో రన్ అయ్యే MIUI 13 స్కిన్‌తో వస్తుంది. నోట్ 11Sలో అందించబడిన సెన్సార్ల ప్యాక్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ సెన్సార్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్ ఇచ్చారు. నోట్ 11S 33W ప్రో ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

ధర-లభ్యత

Redmi Note 11 బేస్ వేరియంట్ అయిన 4GB RAM, 64GB వేరియంట్ రూ.13,499 నుండి ప్రారంభమవుతుంది. 6GB RAM మరియు 64GB వెర్షన్ కోసం 14,499 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. నోట్ 11లో 6GB RAM, 128GB వేరియంట్ కోసం 14,499 అని చెప్పారు. నోట్ 11 హారిజోన్ బ్లూ, స్పేస్ బ్లాక్ మరియు స్టార్‌బర్స్ట్ వైట్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

Redmi Note 11S హ్యాండ్‌సెట్ 6GB RAM, 64GB వెర్షన్ రూ.16,499 దగ్గర ప్రారంభమవుతుంది. 6GB, 128GB వెర్షన్ కోసం 17,499 రూపాయలు ఉంది. Note 11S యొక్క హై-ఎండ్ స్టోరేజ్ వేరియంట్‌కి సంబంధించి 8GB RAM, 128GB స్టోరేజ్ మొబైల్ కోసం 18,499 ధర నిర్ణయించారు. హారిజన్ బ్లూ, పోలార్ వైట్ మరియు స్పేస్ బ్లాక్ షేడ్స్‌ కలర్ లో అందుబాటులో ఉంటుంది.

Redmi Note 11 విక్రయం ఫిబ్రవరి 11 నుండి ప్రారంభమవుతుంది. Redmi Note 11S ఫిబ్రవరి 21 నుండి అందుబాటులో ఉంది. Amazon, Mi హోమ్ స్టోర్, Mi ఆన్‌లైన్ స్టోర్ నుండి ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లను కొనుగోలు చేయవచ్చు.


Next Story