రియల్‌ మీ కొత్త ఫోన్‌.. 10 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌!

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌ మీ తన జీటీ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.

By అంజి  Published on  3 July 2024 5:30 PM IST
Realme GT 6, India,  Smart phone

రియల్‌ మీ కొత్త ఫోన్‌.. 10 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌!

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌ మీ తన జీటీ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. రియల్‌ మీ జీటీ6 పేరిట ఫ్లూయిడ్‌ స్లివర్‌, రేజర్‌ గ్రీన్‌ మూడు రంగుల్లో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో 4ఎన్‌ఎమ్‌ ఆక్టాకోర్‌ స్పాప్‌డ్రాగన్‌ 8 ఎస్‌ జెన్‌3 ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ మొబైల్ 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత యూఐ 5 తో పని చేస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. వెనుకవైపు 108 ఎంపీ కెమెరా ఇచ్చారు. ముందువైపు 32 ఎంపీ కెమెరా అమర్చారు. బ్లూటూత్‌ 5.4, జీపీఎస్‌, వైఫై 6 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 5,500 mAh బ్యాటరీ ఉంటుంది. కేవలం 10 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ అవుతుంది. 120W ఫాస్ట్‌ ఛార్జర్‌ వస్తుంది.

ఇక ఈ మొబైల్‌ ధర విషయానికి వస్తే.. 8జీబీ+256 రూ.40,999గా, 12జీబీ+256 జీబీ ధర రూ.42,999గా ఉంది. 16 జీబీ + 512 జీబీ ధర రూ.44,999 గా కంపెనీ పేర్కొంది.

Next Story