వడ్డీ రేట్లపై ఆర్​బీఐ కీలక నిర్ణయం

రెపో రేట్లకు సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

By అంజి  Published on  5 April 2024 4:58 AM GMT
RBI, Monetary Policy Committee, RBI Governor Shaktikanta Das

వడ్డీ రేట్లపై ఆర్​బీఐ కీలక నిర్ణయం 

రెపో రేట్లకు సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. వడ్డీ రేట్లు 6.5 శాతంగానే కొనసాగనున్నట్టు ప్రకటించింది. కాగా గత ఆరు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో ఆర్‌బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయకుండా 6.5 శాతాన్నే కొనసాగిస్తూ వస్తోంది. రెపో రేటును ఆర్​బీఐ యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా ఏడో సారి. కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024 - 2025) ఆర్‌బీఐకి ఇదే తొలి ప్రకటన.

కాగా 5:1 ఓట్ల మెజారిటీతో ​ఈ ద్రవ్య విధాన నిర్ణయం తీసుకున్నట్లు ఆర్​బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. భారత్‌కు ధృఢమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అయితే ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితి చేయాల్సిన అవసరం ఉందని, ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరిగిందని చెప్పారు. అందుకే ఈ ద్రవ్యోల్బణాన్ని కట్టిడి చేసేందుకు ఆర్​బీఐ కృషి చేస్తోందన్నారు. కాగా ఈ ఏడాది జూన్‌లో ఆర్‌బీఐ ఎంపీసీ తదుపరి మీటింగ్‌ ఉంటుంది. అప్పటి వరకు ఇదే రేట్‌ కొనసాగుతుంది.

Next Story