సామాన్యుడికి ఆర్‌బీఐ షాక్‌.. రెపో రేటు పెంపు.. గృహ, వాహన రుణాలపై పెరగనున్న వడ్డీ రేట్లు

RBI hikes repo rate by 50 basis points.రెపో రేటును మ‌రో 0.50 శాతం పెంచి, 5.90శాతానికి చేర్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sept 2022 10:41 AM IST
సామాన్యుడికి ఆర్‌బీఐ షాక్‌.. రెపో రేటు పెంపు.. గృహ, వాహన రుణాలపై పెరగనున్న వడ్డీ రేట్లు

దేశంలో అంత‌కంత‌కూ పెరిగిపోతున్న ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదుపు చేసేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా వ‌డ్డీ రేటును మ‌రోసారి పెంచుతూ ఆర్బీఐ నిర్ణ‌యం తీసుకుంది. రెపో రేటు(బ్యాంకుల‌కు ఇచ్చే రుణాల‌పై ఆర్బీఐ వ‌సూలు చేసే వ‌డ్డీ)ను మ‌రో 0.50 శాతం పెంచి, 5.90శాతానికి చేర్చింది. దీంతో నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలోనే రెపోరేటు 1.90శాతం పెరిగింది.

సెప్టెంబ‌ర్ 28,29 తేదీల్లో జ‌రిగిన ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధాన క‌మిటీ(MPC) స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను శుక్ర‌వారం ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ వెల్ల‌డించారు. వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం "అసౌకర్యంగా" అధికంగానే ఉందని, ద్రవ్యోల్బణం ఆరు శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.

మ‌రింత భారం కానున్న ఈఎంఐలు

రెపో రేట్ పెరిగితే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లను పెంచుతాయి. దీంతో కస్టమర్లకు ఈఎంఐ భారం అవుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఫలితంగా ఈఎంఐలు భారం అవుతాయి. ముఖ్యంగా హోమ్ లోన్లు ఆర్‌బీఐ రెపో రేట్‌కు లింక్ అయి ఉంటాయి కాబట్టి హోమ్ లోన్ భారం కానుంది. ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ సెక్టార్ పైన ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారిలో రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ఎంచుకుంటూ ఉంటారు. రెపో రేట్ తగ్గితే ఈ వడ్డీ తగ్గుతుంది. రెపో రేట్ పెరిగితే ఈ వడ్డీ పెరుగుతుంది.

Next Story