రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కొత్త చెక్కు ట్రంకేషన్ విధానాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఈ విధానం ప్రస్తుతం దేశంలోని కొన్ని నగరాల్లోనే మాత్రమే అమల్లో ఉండగా, 2021, సెప్టెంబర్ 30 నాటికి అన్ని బ్యాంకులలో విస్తరించాలని ఆర్బీఐ బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులకు ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఇమేజ్ బెస్ట్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్)ను అన్ని శాఖలకు విస్తరించాలని సూచించింది. అయితే కస్టమర్లు ఉండే చోటుతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా సేవలు అందాలని పేర్కొంది. దేశంలోని అన్ని బ్యాంకుల శాఖలన్నింటికీ ఈ విధానాన్ని విస్తరించాలని సూచించింది.
సీటీఎస్ (చెక్ ట్రంకేషన్ సిస్టమ్) అంటే ఏమిటీ..?
చెక్‌ను జారీ చేసినప్పటి నుంచి నగదు చెల్లింపు జరిగే వరకు బ్యాంకు శాఖల మధ్య భౌతికంగా ఆ చెక్ తిరగాల్సిన అవసరం లేకుండా చేయడమే ఈ సీటీఎస్ విధానం. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లోని బ్యాంకుల్లో మాత్రమే ఈ విధానం అందుబాటులో ఉంది. మిగతా ప్రాంతాల్లో అందుబాటులో లేదు. బ్యాంకు వినియోగదారరులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆర్‌బీఐ ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఈ విధానం వల్ల చెక్కును జారీ చేసినప్పటికీ నుంచి నగదు చెల్లింపులు జరిగే వరకు బ్యాంకుల మధ్య భౌతికంగా ఆ చెక్కు తిరగవలసిన అవసరం ఉండదు. కాగా, ఈ సీటీఎస్ విధానం 2010 నుంచే వాడుకలో ఉంది. ప్రస్తుతం 1,50,000 శాఖల్లో ఈ విధానం అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 30 వరకు అన్నిశాఖలకు అందుబాటులో తీసుకువచ్చేందుకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.