శుభ‌వార్త‌.. త‌గ్గిన వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర

Price of commercial LPG cut down by Rs 36.వాణిజ్య సిలిండ‌ర్ వినియోగ‌దారుల‌కు శుభవార్త‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2022 4:07 AM GMT
శుభ‌వార్త‌.. త‌గ్గిన వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర

వాణిజ్య సిలిండ‌ర్ వినియోగ‌దారుల‌కు శుభవార్త‌. ఎల్‌పీజీ(లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) వంట గ్యాస్ సిలిండర్ ధర కొద్దిగా దిగొచ్చింది. 19కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండ‌ర్‌పై రూ.36 త‌గ్గించిన‌ట్లు ఇండియ‌న్ ఆయిల్ సోమ‌వారం తెలిపింది. తాజా త‌గ్గింపుతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 2012.50 కి బదులుగా రూ.1,976 అవుతుంది. కోల్‌కతాలో రూ.2132కి బదులుగా రూ.2,095.50కి, వాణిజ్య రాజ‌ధాని ముంబైలో రూ.1,936.50కి, చెన్నైలో రూ.2,141కి త‌గ్గ‌నుంది.

ఇక హైద‌రాబాద్‌లో రూ.44.50 మేర త‌గ్గింది. దీంతో సిలిండ‌ర్ ధ‌ర రూ.2,242 నుంచి రూ.2,197.50 కి చేరింది. త‌గ్గిన ధ‌ర‌లు నేటి నుంచే అమ‌ల్లో వ‌స్తాయ‌ని చ‌మురు సంస్థ‌లు తెలిపాయి. తాజాగా ధర తగ్గింపుతో టీ స్టాళ్లు, చిన్న పాటి టిఫిన్ సెంటర్లు నడుపుకునే వారికి కాస్త ఊరట లభించనుంది. ఇదిలా ఉంటే గృహ వినియోగ దారులకు సంబంధించిన ఎల్‌పీజీ సిలిండర్‌ ధర మాత్రం తగ్గలేదు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Next Story