రైతులకు రూ.15 లక్షల ఆర్థిక మద్దతు..!
PM Kisan FPO Yojana Government will give 15 lakh rupees of farmers
By తోట వంశీ కుమార్ Published on 4 July 2021 2:00 PM IST
భారత ప్రభుత్వం 'పీఎం కిసాన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్కీమ్ యోజన' పథకాన్ని తీసుకుని వచ్చింది. ఈ పథకం కింద రైతులు అగ్రికల్చర్ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి చేయడానికి మోదీ ప్రభుత్వం రూ.15 లక్షల ఆర్థిక మద్దతు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఈ స్కీమ్‌ను ప్రకటించినప్పటికీ.. ఈ స్కీమ్‌లో ఎలా చేరాలో, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వంటివి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్కీమ్ కింద రూ.15 లక్షలు పొందాలంటే 11 మంది రైతులు కలిసి ఒక ఆర్గనైజేషన్‌గా ఏర్పడాల్సి ఉంటుంది. కంపెనీ చట్టం కింద దీనిని రిజస్ట్రేషన్ చేసుకుంటే దీని ద్వారా విత్తనాలు, మందులు, ఎరువులు, ఇతర పరికరాలు రైతులకు అమ్మొచ్చు. కేంద్ర ప్రభుత్వం 2023-24 నాటికి 10 వేల ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం ఐదేళ్లపాటు వీటికి సాయం అందిస్తుంది. ఒక్కో ఎఫ్‌పీవోకు మోదీ ప్రభుత్వం రూ.15 లక్షల రుణం అందిస్తుంది. దీని ద్వారా ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసుకొని పనులు మొదలు పెట్టొచ్చు. ఓ వైపు వ్యాపార పరంగానే కాకుండా.. మరో వైపు రైతన్నలకు కూడా ఈ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ నిధి, ఫసల్ బీమా వంటి పథకాలను తీసుకురాగా.. ఇప్పుడు ఈ పథకం రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా మరింతగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తోంది.