సామాన్యుడి నెత్తిన పిడుగు.. మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధ‌ర‌లు

Petrol prices hit new highs.సామాన్యుడి నెత్తిన పిడుగుప‌డింది. క‌రోనా క‌ష్ట‌కాలం నుంచి కోలుకోక‌ముందే సామాన్యుడి నెత్తిన పిడుగు.. మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధ‌ర‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2021 1:22 PM IST
Petrol prices hit new highs

సామాన్యుడి నెత్తిన పిడుగుప‌డింది. క‌రోనా క‌ష్ట‌కాలం నుంచి కోలుకోక‌ముందే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు మ‌రోసారి పెరిగాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధ‌ర‌ల‌ను పెంచుతూ.. దేశీయ చ‌మురు విక్ర‌య కంపెనీలు నేడు నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో గతంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డులు సృష్టిస్తూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీట‌ర్ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు బుధ‌వార 25 పైస‌ల మేర పెరిగాయి. దీంతో రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.91.85కి చేరగా.. డీజిల్‌ ధర రూ.83.87కి వచ్చింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ఱ రూ.84.45కు చేరింది. డీజిల్ ధ‌ర రూ.74.38 నుంచి 74.63కి చేరింది.

ఇక దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ.91.07కు చేర‌గా.. డీజిల్ ధ‌ర రూ.81.34గా ఉన్న‌ది. వాస్తవంగా గతంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలను నిర్ణయించేవి. కానీ.. 2017 జూన్‌ 15వ తేదీ నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజువారీగా పెంచడం.. తగ్గించడం చేస్తోంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డంతో.. దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు పెంచ‌డం జ‌రిగింది. మే 2020 నుంచి లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.14.79, డీజిల్ రూ.12.34 పెరిగింది.

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు

చెన్నై - పెట్రోల్ రూ.87.18 - డీజిల్ రూ.79.95

కోల్‌కతా - పెట్రోల్ రూ.85.92 - డీజిల్ రూ.78.22

హైదరాబాద్ - పెట్రోల్ రూ. 87.85 - డీజిల్ రూ.81.45

బెంగళూరు - పెట్రోల్ రూ.87.30 - డీజిల్ రూ.79.14

జైపూర్ - పెట్రోల్ రూ.91.85 - డీజిల్ రూ.83.87


Next Story