ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరో వైపు పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్ ధర వంద దాటడంతో వాహనదారులు వాహానాలను బయటకు తీయాలంటే జంకుతున్నారు. దేశీయ చమురు కంపెనీలు గత కొన్నిరోజులుగా వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 24 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.94.23 చేరగా.. డీజిల్ రూ.85.15కు పెరిగింది. ఇక ఈనెలలో మొత్తం 16 సార్లు ఇంధన ధరలు పెరుగగా.. లీటర్ పెట్రలోల్ ధరపై 3.83 పెంచగా, డీజిల్ పై రూ.4.42కి పెరిగింది.
ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు..
- ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.94.23, డీజిల్ రూ.85.15
- ముంబైలో పెట్రోల్ రూ.100.47, డీజిల్ రూ.92.45
- భోపాల్‌లో పెట్రోల్ రూ.102.34, డీజిల్ రూ.93.37
- చెన్నైలో పెట్రోల్ రూ.95.76, డీజిల్ రూ.89.90
- కోల్‌కతాలో పెట్రోల్ రూ.94.25, డీజిల్ రూ.87.74
- హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.97.93, డీజిల్ రూ.92.83
పెట్రోల్ ధరలు ఒక్కొ రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. వ్యాట్, స్థానిక పన్నులను బట్టీ ఇంధన ధరలు ఆయా రాష్ట్రాల్లో ఒక్కొ రకంగా ఉంటాయి.