మరోసారి అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో... దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గత వారం రోజుల నుండి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నిన్న, మొన్న రెండు రోజులపాటు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ మళ్లీ పెరిగాయి. దీంతో సామాన్య పౌరులకు చమురు ధరలు సమస్యగా మారుతోంది. చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజీల్ ధరలు పెంచుతుండడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై రూ.35 పైసలు, డీజిల్‌పై రూ.37 పైసలను చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో లీటర్‌ పెట్రోల్ రూ.111.08, డీజిల్ రూ.103.53కు పెరిగింది. ఇక విజయవాడలో లీటర్ పెట్రల్ రూ.110.88, డీజిల్ రూ.103.33కు చేరింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109, డీజిల్ రూ.102.04కు పెరిగింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు

ఢిల్లీలో పెట్రోల్ రూ.104.44, డీజిల్ ధర రూ. 93.17

చెన్నైలో పెట్రోల్ రూ.101.79, డీజిల్ ధర రూ.97.59

కోల్‌కతాలో పెట్రోల్ రూ.105.09, డీజిల్ ధర రూ.96.28

ముంబైలో పెట్రోల్ రూ.110.41, డీజిల్ ధర రూ.101.03

అంజి

Next Story