సామాన్యుడికి ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కొద్ది రోజులు స్థిరంగా ఉన్న ధరలు ఇటీవల మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా ఐదోరోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. దీంతో వాహనదారులు వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. శనివారం లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై 35పైసల చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతి రోజు ఉదయం ఆరుగంటలకు ఇంధన ధరలను సవరిస్తుంటాయి చమురు కంపెనీలు. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 103.84 చేరగా.. డీజిల్ ధర రూ.92.47గా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. గత 11 రోజుల్లో లీటర్ పెట్రోల్ పై రూ.2.66, లీటర్ డీజిల్ పై రూ.3.38మేర పెరిగింది.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.103.84, డీజిల్ ధర రూ.92.47
- ముంబైలో పెట్రోల్ ధర రూ.109.82, డీజిల్ ధర 100.29
- చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.37, డీజిల్ ధర రూ.96.93
- కోల్ కతాలో పెట్రోల్ ధర రూ. 104.52, డీజిల్ ధర రూ.95.58
- బెంగళూరులో పెట్రోల్ ధర రూ.107.77, డీజిల్ ధర రూ.98.15
- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.108.02, డీజిల్ ధర రూ.100.89
- గుంటూరులో పెట్రోల్ ధర రూ. 110.12, డీజిల్ ధర రూ. 102.43
- విజయవాడలో పెట్రోల్ ధర రూ.109.92, డీజిల్ ధర రూ.102.23