రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. వాహనదారులు వాహనాలను భయటకు తీయాలంటేనే జంకుతున్నారు. ఇంధన ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో సగటు జీవి బతుకు బండి లాగడం చాలా కష్టంగా మారింది. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధరలు 25 పైసలు పెరగగా.. డీజిల్ 33 పైసలు పెరిగింది. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.89కు డీజిల్ ధర రూ.90.47కి చేరుకుంది.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.102.14, డీజిల్ ధర రూ.90.47
- ముంబైలో పెట్రోల్ ధర రూ.108.19కు, డీజిల్ ధర రూ.98.16
- జైపూర్‌లో పెట్రోల్ ధర రూ.108.98, డీజిల్ రూ.99.63
- కోల్‌కతాలో పెట్రోల్ రూ.102.77, డీజిల్ రూ.93.57,
- చెన్నైలో పెట్రోల్ రూ.99.80, డీజిల్ రూ.95.02,
- బెంగళూరులో పెట్రోల్ రూ.105.69, డీజిల్ రూ.96.02
- లక్నోలో పెట్రోల్ రూ.99.22, డీజిల్ రూ.90.88
-హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.106.26, డీజిల్ ధర రూ.98.72
అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తుంటాయన్న సంగతి తెలిసిందే.