మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. ఈ నెలలో ఏడోసారి
Petrol and diesel price on June 12th.ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా
By తోట వంశీ కుమార్ Published on
12 Jun 2021 3:28 AM GMT

ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా చాలా నగరాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతోంది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90 కాగా, డీజిల్ ధర రూ.94.82 చేరింది. ఈ జూన్ నెలలో ఇప్పటివరకు ఏడు సార్లు ఇంధన ధరలుపెరగ్గా.. మే 4వ తేదీ నుంచి నేటి వరకు 24 సార్లు చమురు ధరలు పెరిగాయి.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
- ఢిల్లీలో పెట్రోల్ రూ.96.13, డీజిల్ రూ.86.98
- ముంబైలో పెట్రోల్ రూ.102.32, డీజిల్ రూ.94.40
- చెన్నైలో పెట్రోల్ రూ.97.47, డీజిల్ రూ. 91.67
- కోల్‌కతాలో రూ.95.08, డీజిల్ రూ.89.85
- భోపాల్ రూ.104.29, డీజిల్ రూ.95.60
- రాంచీ పెట్రోల్ రూ.92.36, డీజిల్ రూ.92.22
- హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.99.90, డీజిల్ రూ.94.82
Next Story