చిరు వ్యాపారులకు ఊరట..స్వల్పంగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది.

By Knakam Karthik
Published on : 1 July 2025 1:32 PM IST

Business News, LPG Gas Cylinder, Commercial LPG cylinder price

చిరు వ్యాపారులకు ఊరట..స్వల్పంగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. అయితే ఈ తగ్గింపు పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లకు ఊరటనిచ్చేది కాకపోయినా చిరు వ్యాపారులకు మాత్రం స్వల్ప ఉపశమనం కలిగిస్తుంది. ఇక 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.58.50 తగ్గించినట్లు ఆయిల్ మార్కెట్ కంపెనీలు వెల్లడించాయి. నేటినుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి.

అయితే, రాష్ట్రాల వారీగా ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది. కమర్షియల్ సిలిండర్‌ ధరలు తగ్గడం వరుసగా ఇది నాలుగోసారి. జూన్‌లో రూ.24 ఏప్రిల్‌లో రూ.41, మేలో రూ.14.50 వరకు వీటి ధరల్ని తగ్గించారు. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో ఈ సిలిండర్‌ ధర రూ.1,665గా ఉంది. ఇక, గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను చమురు సంస్థలు సవరించలేదు.

Next Story