నాణేలపై ప్రజలకు ఉన్న అపోహలు తొలగించేందుకు 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్‌బీఐ) వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపుతోంది. ఒకే విలువ కలిగిన నాణేలు వేరువేరు డిజైన్లలో ఉన్నప్పటికీ చెలామణి అవుతాయని తెలిపింది. అర్ధ రూపాయి (50 పైసలు)తో పాటు రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 కాయిన్స్ చట్టబద్ధమైనవని తెలిపింది. సందేహం లేకుండా వాటిని స్వీకరించాలని సూచించింది. ఇవి సుదీర్ఘకాలం చెలామణిలో ఉంటాయని చెప్పింది.
కాగా 50 పైసలు, రూ.10, రూ.20 నాణేలను కొందరు వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ ప్రజలను అలర్ట్ చేస్తోంది. సోషల్ మీడియా వేదికల్లో, అలాగే వాట్సాప్‌లో వీడియోలతో నాణేలు చెల్లుతాయని చెబుతోంది. నాణేల గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని లేదా పుకార్లను నమ్మవద్దని సూచిస్తోంది. ఎటువంటి సందేహం లేకుండా వాటిని స్వీకరించాలని చెబుతోంది.