ప్రపంచం లోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఫైన్ విధించింది. షేర్ల ట్రేడింగులో అవకతవకలకు సంబంధించిన కేసులో సెబీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కు రూ.25 కోట్లు జరిమానా విధించింది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి రూ.15 కోట్ల రూపాయలు జరిమానా కూడా విధించింది. మొత్తం రూ.40 కోట్లు జరిమానా రిలయన్స్ సంస్థకు విధించింది. మరో రెండు కంపెనీలు అయిన నవీ ముంబై సెజ్ ప్రైవేటు లిమిటెడ్, ముంబై సెజ్ లిమిటెడ్‌లకు వరుసగా రూ. 20 కోట్లు, రూ. 10 కోట్ల జరిమానాలు విధించింది. నవంబరు 2007 సంవత్సరంలో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ (ఆర్‌పీఎల్) షేర్ల ట్రేడింగులో అవకతవకలకు పాల్పడిందంటూ సెబీ ఈ జరిమానాలు విధించింది.
మార్చి 2007లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ పెట్రోలియంలోని 4.1 శాతం వాటాను విక్రయించగా.. ఆర్‌పీఎల్ షేర్ల ధర పడిపోకుండా ఉండేందుకు ప్రణాళికలు రచించారు. మొదట ఫ్యూచర్ మార్కెట్లో విక్రయించి, ఆ తర్వాత స్పాట్ మార్కెట్లో విక్రయించింది. ఆర్ఐఎల్‌కు సీఎండీగా ఉన్న ముకేశ్ అంబానీ దాని రోజు వారీ వ్యవహారాలకు బాధ్యత వహిస్తున్నారని, కాబట్టి ఆర్ఐఎల్ చేసిన మానిప్యులేటెడ్ ట్రేడింగ్‌కు కూడా ఆయనదే బాధ్యత అని సెబీ స్పష్టం చేస్తూ ఆయనకు కూడా జరిమానా విధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు రూ.25 కోట్లు జరిమానా, ముకేశ్ అంబానీకి రూ.15 కోట్ల రూపాయలు జరిమానా విధించింది.