మార్కెట్‌లోకి మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌..ఫీచర్లు ఏంటో తెలుసా?

ప్రముఖ స్మార్ట్ తయారీ కంపెనీ మోటోరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంఛ్ చేసింది.

By Knakam Karthik
Published on : 2 April 2025 4:27 PM IST

Business News, Technology News, Smartphone,

మార్కెట్‌లోకి మోటోరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌..ఫీచర్లు ఏంటో తెలుసా?

ప్రముఖ స్మార్ట్ తయారీ కంపెనీ మోటోరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంఛ్ చేసింది. గతేడాది రిలీజ్ చేసిన ఎడ్జ్ 50 ఫ్యూజన్‌కు కంటిన్యూగానే, లేటెస్ట్‌ ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 5500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 68W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మోటో ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ ఫీచర్స్..

ఈ ఫోన్‌లో 6.70 అంగుళాల 1.5కె ఆల్‌ కర్వ్‌డ్‌ పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్‌ రేటుతో పాటు, 4,500 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్‌ 10+ సపోర్ట్ ఉంది. డిస్‌ప్లేకు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7ఐ ప్రొటెక్షన్‌ను అందించారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను అమర్చారు. ఔటాఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 15 హలో యూఐతో పని చేస్తుంది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేడేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ చెబుతోంది.

కెమెరా పరంగా చూస్తే.. 50MP సోనీ ఎల్‌వైటీ 700సీ ప్రధాన కెమెరా అందించారు. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంది. అదనంగా 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ కెమెరాతో 4కె వీడియో రికార్డింగ్ చేయవచ్చు. మోటో ఏఐ ఆధారంగా ఫొటో ఎన్‌హ్యాన్స్‌మెంట్‌, అడాప్టివ్‌ స్టెబిలైజేషన్‌, మ్యాజిక్‌ ఎరేజర్‌ వంటి ప్రత్యేకమైన ఫీచర్లను అందించారు.

కనెక్టివిటీ & బ్యాటరీ: అదనంగా గూగుల్‌ సర్కిల్‌ సెర్చ్‌, మోటో సెక్యూర్‌ 3.0, స్మార్ట్‌ కనెక్ట్‌ 2.0, ఫ్యామిలీ స్పేస్‌ 3.0, మోటో గెశ్చర్‌ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ ఫోన్‌లో లభిస్తాయి. డాల్బీ అట్మాస్‌ స్టీరియో స్పీకర్లు అదనపు ఆకర్షణ. 5G, 4G LTE, డ్యూయల్‌-బాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.4, GPS, NFC, USB టైప్‌-C పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు అందించారు. 5500mAh బ్యాటరీతో పాటు, 68W వైర్డ్‌ టర్బో ఛార్జింగ్‌ సపోర్ట్ ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్, IP68, IP69 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్లుగా ఉన్నాయి

ఏయే వేరియంట్లలో లభిస్తుంది?

మోటోరోలా ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. 8GB + 256GB వేరియంట్‌ ధర రూ. 22,999 ఉండగా, 12GB + 256GB వేరియంట్‌ ధర రూ. 24,999గా ఉంది. ఈ ఫోన్ ఏప్రిల్‌ 9న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులోకి రానుంది.

Next Story