చుక్కులు చూపిస్తున్న బంగారం ధర.. ఏ నగరంలో ఎంతంటే..?
May 30th gold price.కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ తగ్గుముఖం
By తోట వంశీ కుమార్ Published on 30 May 2021 4:57 AM GMTకొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం.. కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరలు పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 45,800 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పెరిగి రూ.49,950 కి చేరింది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ. 76,200కి చేరింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,750
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,580
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,740
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు.. బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.