ముకేశ్ అంబానీకే 7 కోట్ల టోకరా వేసిన వ్యక్తి

Man defrauds India's richest man Mukesh Ambani. భారతదేశంలోని అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకే 7 కోట్ల టోకరా వేసిన వ్యక్తి.

By Medi Samrat  Published on  22 Jan 2021 6:15 PM IST
Man defrauds Indias richest man Mukesh Ambani

భారతదేశంలోని అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్‌ అంబానీకి 7 కోట్ల రూపాయలు టోకరా వేసిన వ్యక్తి గురించి తెగ చర్చించుకుంటూ ఉన్నారు. ముకేశ్ అంబానీకి 7 కోట్ల రూపాయలు పెద్ద నష్టం కాకపోయినా.. ఈ టోకరా వేసిన వ్యక్తిపై మనీలాండరింగ్‌ కేసు నమోదు అయ్యింది. దీనిపై విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రారంభించింది.

అంబానీకి 7కోట్ల రూపాయలు టోకరా వేసిన వ్యక్తి కల్పేష్ దఫ్తరీపై చర్యలు తీసుకోనున్నారు ఈడీ అధికారులు. కల్పేశ్ దఫ్తరీతో పాటు అహ్మద్, పియూష్ వీరంగామ, విజయ్ గాడియా మరి కొందరి పేర్లు బయటకు వచ్చాయి. దర్యాప్తులో, కల్పేష్ దఫ్తారి, ఇతరులు ఈ డబ్బును ఉపయోగించినట్లు వెల్లడయ్యింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ని మోసం చేసిన కల్పేష్ దఫ్తారి యాజమాన్యంలోని సంకల్ప్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 4.87 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జత చేసింది. ముంబైలో ఉన్న వాణిజ్య సముదాయంతో పాటు రాజ్‌కోట్‌లో మరో నాలుగు వాణిజ్య ఆస్తులు ఉన్నాయి.సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దర్యాప్తు జరుగుతోంది.

కల్పేష్ దఫ్తారి, కొంతమందితో కలిసి ప్రత్యేక వ్యవసాయ, గ్రామ పరిశ్రమ పథకం విశేష్ కృష్ణీ, గ్రామ ఉద్యోగ్ యోజన (వీకేజీయూవై) స్కీమ్‌ 13 లైసెన్సులను స్కామ్ చేసినట్లు ఈడీ తెలిపింది. ఈ లైసెన్సులను కల్ఫేష్‌ హిందుస్తాన్ కాంటినెంటల్ లిమిటెడ్ అనే సంస్థ పేరిట చాలన్ చేసి అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించాడు. ఈడీ దర్యాప్తులో 13 లైసెన్సులను 6.8 కోట్ల రూపాయలకు అమ్మేశాడని.. ఈ మోసం గురించి ఎవరికీ తెలియకుండా ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు బదిలీ చేశాడని అధికారులు గుర్తించారు.




Next Story