అగ్నివీరుల‌కు ఆనంద్ మ‌హీంద్రా ఆఫ‌ర్‌

Mahindra Group to recruit Agnipath Scheme trained young people says Anand Mahindra.ఆర్మీ నియామ‌కాల్లో నూత‌న విధానాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2022 7:20 AM GMT
అగ్నివీరుల‌కు ఆనంద్ మ‌హీంద్రా ఆఫ‌ర్‌

ఆర్మీ నియామ‌కాల్లో నూత‌న విధానాన్ని అమ‌లు చేసే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం అగ్నిప‌థ్ స్కీమ్‌ను తీసుకువ‌చ్చింది. ప్ర‌స్తుతం దీనిపై దేశ వ్యాప్తంగా ఓ వైపు చ‌ర్చ న‌డుస్తుండ‌గానే మ‌రో వైపు నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. కొంద‌రు ఈ ప‌థ‌కానికి సానుకూలంగా కామెంట్లు చేస్తుండ‌గా.. మ‌రికొంద‌రూ విమ‌ర్శిస్తూ మాట్లాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న హింసాత్మ‌క ఆందోళ‌న‌ల‌పై ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రా విచారం వ్య‌క్తం చేశారు. అగ్నిప‌థ్‌పై త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేయ‌డంతో పాటు ఓ అడుగు ముందుకు వేసి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ఆఫ‌ర్‌ను కూడా ప్ర‌క‌టించారు.

అగ్నిప‌థ్ ప‌థ‌కంపై జ‌రుగుతున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు విచార‌క‌రం. గ‌త సంవ‌త్స‌రం ఈ ప‌థ‌కం గురించి తెలిసిన‌ప్పుడు నేను ఒక్క‌టే చెప్పాడు. ఇప్పుడు అదే చెబుతున్నాను. ఈ ప‌థ‌కంతో అగ్నివీరులు పొందే, క్ర‌మ‌శిక్ష‌ణ‌, నైపుణ్యాలు వారికి మంచి ఉపాధి ల‌భించేలా చేస్తాయి. విజయవంతంగా శిక్షణ, సర్వీసు పూర్తి చేసుకున్న అగ్నివీరులకు మహీంద్రా గ్రూపులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. అగ్నిప‌థ్ ప‌థ‌కంపై ఆందోళ‌న‌ల‌కు దేశ వ్యాప్తంగా కొన‌సాగుతున్న ఆందోళ‌న‌ల‌కు మ‌ద్ద‌తుగా.. నేడు ప‌లు సంఘాలు, కొన్ని రాజ‌కీయ పార్టీలు భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇక నిర‌స‌న‌లు కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ అగ్నిప‌థ్‌పై కేంద్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

Next Story