మేడిన్ ఇండియా యాపిల్ ఫోన్స్.. అతి త్వరలో..!

Made-in-India iPhone 12 to hit stores in April-May. యాపిల్ ఇండియా తాజాగా భారత్ లోని యాపిల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక కొద్దిరోజుల్లో మేడిన్‌ ఇండియా ఐఫోన్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

By Medi Samrat  Published on  10 March 2021 1:20 PM GMT
Made-in-India iPhone 12 to hit stores in April-May

యాపిల్ ఫోన్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త వేరియంట్ విడుదల అయ్యిందంటే చాలు.. ఎగబడి కొనడానికి రెడీగా ఉంటారు. భారత్ లో కూడా యాపిల్ ప్రోడక్ట్స్ కు వీరాభిమానులు ఉన్నారు. యాపిల్ ఇండియా తాజాగా భారత్ లోని యాపిల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక కొద్దిరోజుల్లో మేడిన్‌ ఇండియా ఐఫోన్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఐఫోన్ 12 ఇప్పుడు భారతదేశంలో స్థానికంగా తయారవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని విశ్లేషకులు, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మేడిన్‌ ఇండియా ఐఫోన్‌12 తక్కువ ధరకే లభించవచ్చని ఆశిస్తున్నారు.

స్థానిక వినియోగదారుల కోసం భారత్‌లో మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్ 12 మోడల్ ఫోన్ల తయారీని ప్రారంభించనుండటం చాలా గర్వంగా ఉందని ఐఫోన్ ఇండియా తెలిపింది.భారతదేశంలో ఐఫోన్ 12 స్థానికంగా రూపొందడంతో తమ లాభాలు మరింత పుంజుకుంటాయని భావిస్తున్నామని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజీ), సైబర్ మీడియా రీసెర్చ్ లిమిటెడ్ హెడ్ ప్రభు రామ్ చెప్పారు.


Next Story