శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌

LPG commercial cylinder price slash at 115 rupees.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను త‌గ్గించేశాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Nov 2022 2:23 AM GMT
శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌

న‌వంబ‌ర్ నెల వ‌స్తూనే తీపి క‌బురు తీసుకువ‌చ్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను త‌గ్గించేశాయి.19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండ‌ర్ల‌పై రూ.115 త‌గ్గించాయి. త‌గ్గించిన ధ‌ర‌లు నేటి నుంచే అమ‌ల్లోకి వ‌చ్చాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర త‌గ్గగా.. సాధార‌ణంగా ఇళ్ల‌లో వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే ఉంది. జూలై 6 నుంచి 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు నిలకడగానే ఉంటూ వ‌స్తోంది.

19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధ‌ర‌ ఢిల్లీలో రూ. 115 త‌గ్గగా.. కోల్‌కతాలో రూ. 113, ముంబైలో రూ. 115.5, చెన్నైలో రూ.116.5గా త‌గ్గింది. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు రూ.1,859 కి బ‌దులుగా 1,744కి త‌గ్గింది. కోల్‌కతాలో రూ.1,995కి బ‌దులు రూ.1,846కి ల‌భించ‌నుంది. ముంబైలో రూ.1,844కి బ‌దులుగా రూ.1,696కి దిగివ‌చ్చింది. చెన్నైలో రూ.2,009.5కి బ‌దులుగా రూ. 1893గా ఉంది.

ఇక 14.2 కేజీల సిలిండర్ రేటు విషయానికి వస్తే.. ముంబైలో రూ. 1052గా ఉంది. కోల్‌కతాలో రూ. 1079, ఢిల్లీలో రూ. 1053, చెన్నైలో రూ. 1068గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ రేటు రూ. 1111 వరకు ఉంది.

Next Story