LIC నుంచి మరో కొత్త ప్లాన్..బెనిఫిట్స్ ఇవే!
ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ పేరిట సింగిల్ ప్రీమియం ప్లాన్‌ను ప్రకటించింది
By - Knakam Karthik |
LIC నుంచి మరో కొత్త ప్లాన్..బెనిఫిట్స్ ఇవే!
ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ పేరిట సింగిల్ ప్రీమియం ప్లాన్‌ను ప్రకటించింది. జనవరి 12 నుంచి దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు మంగళవారం సమాచారం ఇచ్చింది. నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, ఇండివిజ్యువల్, సేవింగ్స్, పూర్తి జీవితకాలానికి బీమా అందించే ప్లాన్ ఇది. ప్రీమియం, ఇతర వివరాలు వెల్లడించలేదు. జీవన్ ఉత్సవ్ పేరిట రెండేళ్ల క్రితం ఓ పాల సీని ఎస్ఐసీ తీసుకొచ్చింది. దానికే మార్పులు చేసి సింగిల్ ప్రీమియంగా తీసుకొచ్చే అవకా శం ఉంది. ఒకసారి పాలసీని కొనుగోలు చేస్తే జీవితాంతం ఆదాయం పొందవచ్చు.
జనవరి 12 నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి రానుండగా..నెల వయసు పిల్లల నుంచి 65 ఏళ్ల వయసున్న వారు ఈ పాలసీకి అర్హులు. కనీస బీమా మొత్తం రూ.5 లక్షలు, గరిష్ట పరిమితి లేదు. 7 నుంచి 17 ఏళ్ల తర్వాత ప్రైమరీ బీమా మొత్తంలో 10 శాతం ఆదాయం లభిస్తుంది. దీనిని ఎల్‌ఐసీ వద్దే ఉంచితే 5.5 శాతం చక్రవడ్డీ చెల్లిస్తుంది.
మరోవైపు కాలం చెల్లిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశం కల్పిస్తూ ప్రత్యేక పునరుద్ధరణ కార్యక్ర మాన్ని ఎల్ఐసీ చేపట్టింది. ప్రీమియం చెల్లింపుల గడువు దాటి, కాలవ్యవధి పూర్తికాని పాలసీలను ఈ కార్యక్రమంలో భాగంగా పునరుద్ధరించుకోవచ్చు. జనవరి 1 నుంచి మార్చి 2 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా ఆలస్య రుసుము విషయంలోనూ రాయితీ ఇస్తున్నట్లు ఎల్ఐసీ ప్రకటించింది. నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై గరిష్ఠంగా 30 శాతం (రూ.5వేల వరకు), మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్లపై నూరు శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయి ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ సమయం ఉన్న పాలసీలను మాత్రమే పునరుద్దరించుకోవచ్చు.