శుభవార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

June 8th gold price.బంగారం ప్రియుల‌కు శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2021 1:53 AM GMT
శుభవార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

బంగారం ప్రియుల‌కు శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగా కూడా పెరుగుతూ వ‌చ్చిన ప‌సిడి ధ‌ర ఈ రోజు భారీగా త‌గ్గింది. తాజాగా రూ.800లు త‌గ్గింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెరిగింది. మంగళవారం 22 క్యారెట్ల తులం బంగారం.. రూ.47,510 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 48,510 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 47,950, 24 క్యారెట్ల ధ‌ర రూ. 52,300

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 47,510, 24 క్యారెట్ల ధ‌ర రూ. 48,510

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,800, 24 క్యారెట్ల ధ‌ర రూ. 49,970

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,050, 24 క్యారెట్ల ధ‌ర రూ.50,240

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,800, 24 క్యారెట్ల ధర రూ.49,970

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,800, 24 క్యారెట్ల రూ.49,970

విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,800, 24 క్యారెట్ల రూ. 49,970

బంగారం ధరల్లో హెచ్చుత‌గ్గుల‌కు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు.. బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.

Next Story