స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

June 21th Gold price.గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. వ‌రుస‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2021 2:06 AM GMT
స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. వ‌రుస‌గా తొమ్మిదో రోజు కూడా బంగారం ధ‌ర స్వ‌ల్పంగా త‌గ్గింది. కొన్ని చోట్ల తగ్గగా.. మరికొన్నిచోట్ల ధరలు స్థిరంగానే ఉన్నాయి. గత 10 రోజుల్లో బంగారం ధర 9 సార్లు తగ్గగా.. 1 సారి మాత్రమే పెరిగింది. సోమ‌వారం 22 క్యారెట్ల తులం బంగారం ధర.. రూ. 46,220 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 47,220 ఉంది

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి..

- ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 46,140, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 50,330

- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 46,220, 24 క్యారెట్ల ధర రూ. 47,220

- బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 43,990, 24 క్యారెట్ల రూ. 47,990

- చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,290, 24 క్యారెట్ల ధర రూ. 48,290

- హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.43,990, 24 క్యారెట్ల ధర రూ.47,990

- విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 43,990, 24 క్యారెట్ల రూ.47,990

- విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 43,990, 24 క్యారెట్ల రూ. 47,990

బంగారం ధరల్లో హెచ్చుత‌గ్గులు చోటుచేసుకోవ‌డానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.

Next Story