ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గుముఖం ప‌డుతున్న బంగారం ధ‌ర‌

June 17th Gold price.బంగారం కొనాల‌నుకునే వారికి శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2021 1:50 AM GMT
ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గుముఖం ప‌డుతున్న బంగారం ధ‌ర‌

బంగారం కొనాల‌నుకునే వారికి శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఈ రోజు కూడా బంగారం ధ‌ర‌లు దిగి వ‌చ్చాయి. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.190 మేర తగ్గింది. దేశీయంగా పరిశీలిస్తే ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410 వద్ద కొనసాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410.

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,470

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,470

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,470

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,350 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,470

బంగారం ధ‌ర‌ల్లో ప్ర‌తిరోజు హెచ్చుత‌గ్గులు ఉంటాయి. బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు.


Next Story