వ‌రుస‌గా నాలుగో రోజు త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఎంతంటే..?

June 16th Gold price.బంగారం ధ‌ర వ‌రుస‌గా నాలుగో రోజు కూడా త‌గ్గింది. బుధ‌వారం ఉదయానికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2021 1:44 AM GMT
వ‌రుస‌గా నాలుగో రోజు త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఎంతంటే..?

బంగారం ధ‌ర వ‌రుస‌గా నాలుగో రోజు కూడా త‌గ్గింది. బుధ‌వారం ఉద‌యానికి బంగారం ధ‌ర స్వ‌ల్పంగా త‌గ్గింది. అంటే 10 గ్రాములపై కేవలం రూ.10 మాత్రమే తగ్గింది. గత 10 రోజుల్లో బంగారం ధర 6 సార్లు పెరగగా 3 సార్లు తగ్గింది. 1 సారి స్థిరంగా ఉంది. గత 4 రోజుల్లో బంగారం ధర 10 గ్రాములు రూ.600 తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.670 తగ్గింది. హైదరాబాద్, సికింద్రాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 47,650, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 51,800

- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 47,600, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,600

- బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,500, 24 క్యారెట్ల రూ. 49,630

- చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధ‌ర రూ. 45,760, 24 క్యారెట్ల బంగారం రూ. 49,920

- హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,500, 24 క్యారెట్ల ధర రూ.49,630

- విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,500, 24 క్యారెట్ల రూ.49,630

బంగారం ధ‌ర‌ల్లో ప్ర‌తిరోజు హెచ్చుత‌గ్గులు ఉంటాయి. బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు.

Next Story