బంగారం ప్రియుల‌కు గుడ్‌న్యూస్.. భారీగా త‌గ్గిన ధ‌ర‌లు

June 12th gold price.బంగారం కొనాల‌నుకునే వారికి శుభ‌వార్త‌. గ‌త రెండు మూడు రోజులుగా పెరుగుతూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jun 2021 2:38 AM GMT
బంగారం ప్రియుల‌కు గుడ్‌న్యూస్.. భారీగా త‌గ్గిన ధ‌ర‌లు

బంగారం కొనాల‌నుకునే వారికి శుభ‌వార్త‌. గ‌త రెండు మూడు రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ ఆదివారం త‌గ్గింది. మ‌రోవైపు వెండి ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ నడిచిందని నిపుణులు చెబుతున్నారు.

ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 త‌గ్గి రూ. 45,750 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 త‌గ్గి రూ.49,900 కి చేరింది. బంగారం ధరలు పెరిగితే వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈ రోజు కిలో వెండి ధర 77,300 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,900, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.52,200

- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,740, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,740

- చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,050, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,230

- బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,750, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,900

- కోల్‌క‌తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.48,500, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.51,200

- హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,750, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 49,900

- విజ‌య‌వాడ‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,750, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 49,900

బంగారం ధరల్లో హెచ్చుత‌గ్గుల‌కు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు.. బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.

Next Story