బంగారం మ‌రింత ప్రియం..

June 11th gold price.గ‌త‌కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2021 2:24 AM GMT
బంగారం మ‌రింత ప్రియం..

గ‌త‌కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న,మొన్న‌టి వ‌ర‌కు స్త‌బ్థుగా ఉన్న ధ‌ర‌లు నేడు మ‌ళ్లీ పెరిగాయి. బంగారం ధరలు అంతర్జాతీయంగా కూడా పెరుగుతున్నాయి. రూపాయితో పోల్చితే డాలర్ బలపడుతోంది. కాబట్టి మనం బంగారం దిగుమతులకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి. గత 10 రోజుల్లో బంగారం ధర 5 సార్లు పెరగగా... 3 సార్లు తగ్గింది. 2 సార్లు స్థిరంగా ఉంది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.300 పెరిగి రూ.50,300 పలికింది. 22 క్యారెట్ల ధర కూడా అంతేస్థాయిలో పెరిగి రూ.46,100గా ఉంది. అలాగే కిలో వెండి రూ.1,200 ఎగబాకి రూ.77,300కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,898 డాలర్లు, వెండి 28.15 డాలర్లుగా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,250, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.52,640

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,760, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,760

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,350, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,550

బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,100, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,300

హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,100, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,300

విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,100, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,300

బంగారం ధరల్లో హెచ్చుత‌గ్గుల‌కు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు.. బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.

Next Story