ప్రస్తుతం ఉన్న బీమా పాలసీల్లో ఎలాంటి మార్పులు చేయరాదని ఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా రంగ ఇన్సూరెన్స్ 'రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా' (ఐఆర్‌డీఏఐ) ఆదేశించింది. మార్పులతో బీమా ప్రిమియంలు పెరిగే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ఇలా మార్పులు చేసినట్లయితే పాలసీదారులు ఇబ్బందులు పడతారని తెలిపింది. వ్యక్తిగత బీమా, ప్రయాణ బీమా కవరేజీల జోలికి వెళ్లరాదని పేర్కొంది. పాలసీదారుల అంగీకారంపై స్టాండర్‌లోన్ ప్రీమియం రేటుతో ప్రస్తుతం ప్రయోజనాలకు కొత్త వాటిని జత చేసుకోవచ్చని ఐఆర్డీఏఐ సూచించింది.
అలాగే ఆరోగ్య బీమా వ్యాపారంలో పాలసీల కోసం గత ఏడాది జూలైలో జారీ చేసిన ఏకీకృత మార్గదర్శకాలకు అనుగుణంగా స్వల్ప మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. బీమా రంగంలో ఎఫ్‌డీఏ పరిమితిని 74 శాతానికి పెంచేందుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బీమా సంస్థల మూలధన అవసరాలను తీర్చడానికి ఎఫ్‌డీఐ దోహపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. అలాగే ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్న తరుణంలో ఐఆర్డీఏఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆరోగ్య బీమా ఉన్నవారు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రియాక్షన్‌కు గురై ఆస్పత్రుల్లో చేరినట్లయితే ఆ ఖర్చులు బీమా పరిధిలోకి వస్తాయని నిర్మలాసీతామన్ ప్రకటించారు. మార్చి నెలాఖరు వరకు మెచ్యూరిటీ క్లెయిమ్ డాక్యుమెంట్లను పాలసీదారులు తమ సమీపంలో ఉన్న ఎల్‌ఐసీ కార్యాలయంలో సమర్పించి సెటిల్‌మెంట్ చేసుకోవచ్చని తెలిపింది.