ఇంధన కొరతపై ప్రచారం..అలాంటిదేం లేదన్న IOC

దేశవ్యాప్తంగా ప్రజలు ఇంధనం కొనుగోలు విషయంలో భయాందోళనలకు గురికావద్దని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కోరింది.

By Knakam Karthik
Published on : 9 May 2025 1:30 PM IST

Business News, Indian Oil Corporation Limited, Fuel Shortage, Fake News, India-Pakistan Tension,

ఇంధన కొరతపై ప్రచారం..అలాంటిదేం లేదన్న IOC

దేశవ్యాప్తంగా ప్రజలు ఇంధనం కొనుగోలు విషయంలో భయాందోళనలకు గురికావద్దని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కోరింది. అన్ని అవుట్‌లెట్లలో తగినంత పెట్రోల్, డీజిల్ మరియు LPG స్టాక్ అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. తమ సరఫరా కార్యకలాపాలు ఎటువంటి సమస్యలు లేకుండా కొనసాగుతున్నాయని కంపెనీ తెలిపింది.

అయితే భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ సోషల్ మీడియాలో పలు ఫేక్ న్యూస్ వైరల్ గా మారుతున్నాయి. పొరుగు దేశంతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడిందంటూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దేశవ్యాప్తంగా చమురు నిల్వల్లో కొరత ఏర్పడిందని, పెట్రోల్ డీజిల్ నిల్వలు తక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టం చేసింది. తమ వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ‘‘దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఆయిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ఆయిల్ సరఫరా వ్యవస్థ సజావుగా పనిచేస్తోంది. ఇంధనం విషయంలో ఎవరికీ ఎలాంటి ఆందోళన ఆందోళన అక్కర్లేదు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూ కట్టాల్సిన పనిలేదు. బంకుల వద్ద అనవసర రద్దీని నివారించి, మెరుగైన సేవలు అందించేందుకు మాకు సహకరించండి’’ అంటూ ఇండియన్ ఆయిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.

Next Story