క్రెడిట్‌ కార్డు వాడకుంటే.. స్కోర్‌ తగ్గుతుందా?

ఇటీవల కాలంలో క్రెడిట్‌ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కూరగాయలు కొనడం వంటి చిన్న ఖర్చుల నుంచి ట్రావెల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి పెద్ద ఖర్చుల వరకు ప్రతి అవసరానికి క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు.

By అంజి
Published on : 22 July 2025 10:45 AM IST

credit card, credit score, Credit utilization ratio

క్రెడిట్‌ కార్డు వాడకుంటే.. స్కోర్‌ తగ్గుతుందా?

ఇటీవల కాలంలో క్రెడిట్‌ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కూరగాయలు కొనడం వంటి చిన్న ఖర్చుల నుంచి ట్రావెల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి పెద్ద ఖర్చుల వరకు ప్రతి అవసరానికి క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్‌ల కోసం చాలా మంది రకరకాల బ్యాంకుల నుంచి క్రెడిట్‌ కార్డులను తీసుకుంటున్నారు. అయితే, తీసుకున్న క్రెడిట్‌ కార్డును కొందరు చాలా కాలం పాటు ఉపయోగించకుండా వదిలేస్తున్నారు. మరి అలా వాడకుండా ఉండొచ్చా? దీని వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఇది క్రెడిట్‌ స్కోర్‌పై ఏమైనా ప్రభావం చూపుతుందా? ఇప్పుడు తెలుసుకుందాం..

కార్డు క్లోజ్‌ చేస్తారా?

ఓ క్రెడిట్‌ కార్డును సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు ఉపయోగించకుండా వదిలేస్తే.. బ్యాంకులు దాన్ని క్లోజ్‌ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ఇలా చేయడానికి ముందు బ్యాంకులు మీకు తప్పకుండా సమాచారాన్ని అందిస్తాయి. మీరు ఎలాగూ క్రెడిట్‌ కార్డును వినియోగించడం లేదు కాబట్టి వద్దని చెబితే.. వారు 30 రోజుల్లోగా దాన్ని క్లోజ్‌ చేస్తారు.

క్రెడిట్‌ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం?

ఉపయోగించని క్రెడిట్‌ కార్డులు మీ క్రెడిట్‌ స్కోర్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. అయితే, అది మీ కార్డు యాక్టివ్‌గా ఉన్నంత వరకు మాత్రమే సాధ్యమవుతుంది. దీనికి ప్రధాన కారణం క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో. మీరు కార్డును వాడకపోతే.. దాని క్రెడిట్‌ లిమిట్‌ మీ మొత్తం అందుబాటులో ఉన్న క్రెడిట్‌ లిమిట్‌కు జోడిస్తారు. దీనివల్ల మీ క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో తగ్గుతుంది. తక్కువ క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో మీరు మీ క్రెడిట్‌ కార్డును బాధ్యతాయుతంగా ఉపయోగిస్తున్నారని సూచిస్తుంది. ఇది మీ క్రెడిట్‌ స్కోర్‌ను మెరుగుపరుస్తుంది. కానీ, మీ క్రెడిట్‌ కార్డు ఎక్కువ కాలం ఉపయోగించుండా ఇనాక్టివ్‌ అయితే మాత్రం మీ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒక వేళ కార్డు క్లోజ్‌ అయితే.. మీ క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో పెరుగుతుంది. ముఖ్యంగా మీకు ఉన్న ఏకైక క్రెడిట్‌ కార్డు అదే అయితే.. మీ క్రెడిట్‌ హిస్టరీ కూడా దెబ్బతింటుంది. కాబట్టి, కార్డును యాక్టివ్‌గా ఉంచడానికి చిన్న లావాదేవీలు చేయడం మంచిది.

Next Story