పదే పదే చెక్‌ చేస్తే.. క్రెడిట్‌ స్కోర్‌ తగ్గుతుందా?

కొందరు రుణం తీసుకునే ముందు క్రెడిట్‌ స్కోర్‌ను చెక్‌ చేస్తుంటారు. మరికొందరు అవసరం లేకపోయినా మాటిమాటికి స్కోర్‌ ఎంతుందో అని చెక్‌ చేస్తుంటారు.

By అంజి
Published on : 13 July 2025 12:48 PM IST

credit score, CIBIL score, credit, banking

పదే పదే చెక్‌ చేస్తే.. క్రెడిట్‌ స్కోర్‌ తగ్గుతుందా?

కొందరు రుణం తీసుకునే ముందు క్రెడిట్‌ స్కోర్‌ను చెక్‌ చేస్తుంటారు. మరికొందరు అవసరం లేకపోయినా మాటిమాటికి స్కోర్‌ ఎంతుందో అని చెక్‌ చేస్తుంటారు. అయితే ఇలా ఎక్కువ సార్లు క్రెడిట్‌ స్కోర్‌ను చెక్‌ చేస్తే ఆ స్కోర్‌ తగ్గుతుందనే భావన చాలామందిలో ఉంటుంది. మరి అది నిజమా? కాదా? ఇప్పుడు తెలుసుకుందాం..

మీరు రుణం కోసం వెళ్లినప్పుడు బ్యాంకులు మీ క్రెడిట్‌ స్కోర్‌ను తనిఖీ చేస్తుంటాయి. ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకులు ఇలా ముందస్తు రుణాల కోసం చెక్‌ చేయడాన్ని సాఫ్ట్‌ ఎంక్వైరీ అంటారు. దీని వల్ల మీ క్రెడిట్‌ స్కోర్‌కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీరు పని చేస్తున్న సంస్థ మీ క్రెడిట్‌ స్కోర్‌ చెక్‌ చేసినా.. అది సాఫ్ట్‌ ఎంక్వైరీ కిందకే వస్తుంది.

అయితే మీరు రుణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాక.. క్రెడిట్‌ నివేదికల కోసం అభ్యర్థిస్తే దాన్ని హార్డ్‌ ఎంక్వైరీ అంటారు. దీని వల్ల మీ క్రెడిట్‌ స్కోర్‌ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎంత తగ్గుతుంది అనేది మీ ప్రస్తుత క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ చరిత్ర, హార్డ్‌ ఎంక్వైరీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఇలా ఎంక్వైరీ చేస్తే నష్టభయం పెరుగుదలను సూచిస్తూ క్రెడిట్‌ బ్యూరో సంస్థలు ఒక్కో ఎంక్వైరీపై 3 నుంచి 10 పాయింట్ల వరకు క్రెడిట్‌ స్కోర్‌ను తగ్గిస్తాయి.

Next Story