ఓయో బుకింగ్స్‌లో హైదరాబాద్‌ టాప్‌

ఆతిథ్య సేవల ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ఓయో హోటల్‌ బుకింగ్స్‌లో నగరాల వారిగా చూసుకుంటే.. హైదరాబాద్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది.

By అంజి  Published on  19 Dec 2023 3:45 AM GMT
Hyderabad,Oyo Hotel Bookings, Oyo, Travelopedia 2023

ఓయో బుకింగ్స్‌లో హైదరాబాద్‌ టాప్‌

ఆతిథ్య సేవల ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ఓయో హోటల్‌ బుకింగ్స్‌లో నగరాల వారిగా చూసుకుంటే.. హైదరాబాద్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. ఇక రెండో స్థానంలో బెంగళూరు ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే యూపీ మొదటి స్థానంలో, మహారాష్ట్ర రెండో స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు ఓయో ట్రావెలోపీడియా - 2023 పేరిట సోమవారం నాడు ఓ రిపోర్ట్‌ని రిలీజ్‌ చేసింది. నగరాలు, రాష్ట్రాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల వారీగా ర్యాంకులను తన రిపోర్టులో తెలిపింది. ఈ సంవత్సరం అత్యధికంగా ఓయో బుకింగ్స్‌ నమోదైన నగరంగా హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతాలు ఉన్నాయి. వరంగల్‌, గుంటూరు, గోరఖ్‌పూర్‌, దిఘా వంటి చిన్న నగరాలు గత సంవత్సరంతో పోలిస్తే మెరుగైన వృద్ధిని నమోదు చేశాయని రిపోర్టులో తెలిపింది.

ఫ్రీ టైమ్‌లో ఎక్కువ మంది సందర్శించిన ప్రదేశాల్లో జైపూర్‌ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో గోవా, మైసూర్‌, పుద్దుచ్చేరి ఉన్నాయి. ఇక ఆధ్యాత్మిక ప్రదేశాల లిస్ట్‌లో పూరీ మొదటి స్థానంలో, అమృత్‌సర్‌, వారణాసి, హరిద్వారా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేవ్‌గఢ్‌, గోవర్ధన్‌, పళని వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా గత సంవత్సరం కంటే మెరుగైన వృద్ధిని నమోదు చేశాయని ఓయో తెలిపింది. రాష్ట్రాల వారీగా బుకింగ్స్‌ చూస్తే యూపీ మొదటి స్థానంలో ఉన్నట్టు ఓయో ప్రకటించింది. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నట్లు ఓయో రిపోర్ట్ వెల్లడించింది. కొవిడ్‌ తర్వాత టూరిజం సాధారణ స్థితికి చేరుకున్నట్లు ఓయో చెప్పింది. కొవిడ్‌ తర్వాత కొత్త ప్రదేశాల సందర్శన పెరిగిందని, ఈ ట్రెండ్‌ ఈ ఏడాది కూడా కొనసాగిందని ఓయో తెలిపింది.

Next Story