మే నెలలో బ్యాంకులకు సెలవులు.. పూర్తి జాబితా ఇక్కడ ఉంది
మే 1 మహారాష్ట్ర దినోత్సవం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజు హైదరాబాద్, అనేక ఇతర
By అంజి Published on 1 May 2023 1:00 PM ISTHere is the complete list of bank holidays in May
హైదరాబాద్: మే 1 మహారాష్ట్ర దినోత్సవం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజు హైదరాబాద్, అనేక ఇతర భారతీయ నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. దీనికి అదనంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 2023కి మరో 11 బ్యాంకులకు సెలవులు ప్రకటించింది. మే 1న బ్యాంకులు మూసివేయబడే ఇతర నగరాలు బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, ఇంఫాల్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా మరియు తిరువనంతపురం.
మేలో బ్యాంకు సెలవుల జాబితా
మే 2023లో నాలుగు ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు కలిపి మొత్తం 12 రోజులు బ్యాంకులకు ఆర్‌బీఐ సెలవులను ప్రకటించింది. వీటిలో ఆరు సెలవులు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద గుర్తించబడ్డాయి. బ్యాంకు సెలవులు రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారవచ్చు. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మొత్తం 12 రోజులలో మూసివేయబడవు.
మే 2023 నెలలో బ్యాంక్ సెలవుల జాబితా క్రింద ఉంది.
మే 1: మహారాష్ట్ర డే/మే డే
మే 2: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, 2023 (సిమ్లా)
మే 5: బుద్ధ పూర్ణిమ
మే 7: ఆదివారం
మే 9: రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు
మే 13: రెండవ శనివారం
మే 14: ఆదివారం
మే 16: రాష్ట్ర దినోత్సవం (సిక్కిం)
మే 21: ఆదివారం
మే 22: మహారాణా ప్రతాప్ జయంతి (హిమాచల్ ప్రదేశ్)
మే 27: నాల్గవ శనివారం
మే 28: ఆదివారం
మే 1, 7, 13, 14, 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లోని బ్యాంకులు మూతపడనున్నాయి.
హైదరాబాద్, ఇతర భారతీయ నగరాల్లోని బ్యాంకుల రకాలు
భారతదేశంలో వివిధ రకాలైన బ్యాంకులు ఉన్నాయి. ప్రతి బ్యాంకుకు దాని ప్రత్యేక లక్షణాలు, విధులు ఉన్నాయి. భారతదేశంలోని కొన్ని రకాల బ్యాంకుల జాబితా ఇక్కడ ఉంది:
ప్రభుత్వ రంగ బ్యాంకులు: ఈ బ్యాంకులు భారత ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడతాయి. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్.
ప్రైవేట్ రంగ బ్యాంకులు: ఈ బ్యాంకులు ప్రైవేట్ కంపెనీలు లేదా వ్యక్తుల యాజమాన్యంలో ఉంటాయి. ఇవి వారి ఆధీనంలోనే నిర్వహించబడతాయి. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్.
సహకార బ్యాంకులు: ఈ బ్యాంకులు వాటి సభ్యుల ఆధారంగా నిర్వహించబడతాయి. ఉదాహరణలు సరస్వత్ బ్యాంక్, అభ్యుదయ కో-ఆపరేటివ్ బ్యాంక్, కాస్మోస్ బ్యాంక్.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు: ఈ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలను అందించడానికి స్థాపించబడ్డాయి. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, బరోడా రాజస్థాన్ క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్, ఛత్తీస్‌గఢ్ రాజ్య గ్రామీణ బ్యాంక్ ఉదాహరణలు.
చెల్లింపు బ్యాంకులు: ఈ బ్యాంకులు డిపాజిట్లను స్వీకరించడం, చెల్లింపులు చేయడం వంటి పరిమిత సేవలను మాత్రమే అందించడానికి లైసెన్స్‌ను కలిగి ఉంటాయి. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వంటివి ఉదాహరణలు.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు: ఈ బ్యాంకులు చిన్న వ్యాపారాలు, తక్కువ-ఆదాయ కుటుంబాలకు బ్యాంకింగ్ సౌకర్యాలను అందించడానికి స్థాపించబడ్డాయి. ఉదాహరణలలో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి.
విదేశీ బ్యాంకులు: ఈ బ్యాంకులు విదేశీ సంస్థల యాజమాన్యంలో ఉంటాయి. ఉదాహరణకు సిటీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ.
ఇలాంటి బ్యాంకులు చాలా వరకు హైదరాబాద్‌లోనే ఉన్నాయి.