ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన HDFC

దేశంలో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన హెచ్‌డీఎఫ్‌ఎసీ బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది.

By Knakam Karthik
Published on : 9 Aug 2025 7:38 AM IST

Business News, HDFC Bank, Home loan rates, MCLR

ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన HDFC

దేశంలో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన హెచ్‌డీఎఫ్‌ఎసీ బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. సవరించిన రేట్లు ఆగస్టు 7 నుంచే అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. బ్యాంకు నిర్ణయంతో వినియోగదారులు తీసుకునే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐల భారం తగ్గనుంది. ఎంపిక చేసిన రుణాల కాలవ్యవధులపై బ్యాంకు ఎంసీఎల్ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రిటైల్ రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ మాత్రం 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, సవరించిన తర్వాత రుణాల రేట్లు 8.55 శాతం నుంచి 8.75 శాతం మధ్య ఉంది. ఇదివరకు 8.60 శాతం నుంచి 8.80 శాతం మధ్య ఉండేది. కొత్త రేట్లకు సంబంధించి.. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.55 శాతానికి, 3 నెలల ఎంసీఎల్ఆర్ 8.60 శాతానికి, 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.70 శాతానికి, ఏడాది ఎంసీఎల్ఆర్ 9.05 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గించింది. 2 ఏళ్ల ఎంసీఎల్ఆర్ 8.75 శాతం స్థిరంగా ఉంచింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.75 శాతానికి తగ్గించింది.

MCLR రేట్లు ఎంత?

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్‌లో, బ్యాంక్ నిధుల ఖర్చు, నిర్వహణ ఖర్చులు మరియు లాభ మార్జిన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దాని కనీస వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. అయితే, RBI రెపో రేటును మార్చినప్పుడు, అది MCLR ను కూడా ప్రభావితం చేస్తుంది.

RBI సూచనల ప్రకారం, బ్యాంకు MCLR కంటే తక్కువ రేటుకు గృహ రుణం లేదా కారు రుణం ఏదైనా రుణం ఇవ్వదు. బ్యాంక్ MCLRని తగ్గిస్తే, రుణ రేట్లు స్వయంచాలకంగా తగ్గుతాయి. బ్యాంక్ MCLRని పెంచితే, మీ EMI కూడా పెరుగుతుంది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు మరియు కారు రుణాలు దాని పరిధిలోకి వస్తాయి.

Next Story