ప్ర‌పంచ‌వ్యాప్తంగా గూగుల్ సేవ‌ల్లో అంత‌రాయం..! సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల మండిపాటు

Google users face disruptions after global outage.ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవ‌ల్లో అంత‌రాయం ఏర్ప‌డింది. మంగ‌ళ‌వారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2022 11:19 AM IST
ప్ర‌పంచ‌వ్యాప్తంగా గూగుల్ సేవ‌ల్లో అంత‌రాయం..! సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల మండిపాటు

ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవ‌ల్లో అంత‌రాయం ఏర్ప‌డింది. మంగ‌ళ‌వారం ఉద‌యం కొంత‌సేపు గూగుల్ సేవ‌ల్లో అంత‌రాయం ఏర్ప‌డడంతో వేలాది మంది యూజ‌ర్లు ఫిర్యాదులు చేశారు. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌తో పాటు జీమెయిల్‌ సర్వీస్‌, యూట్యూబ్‌, గూగుల్‌ మ్యాప్స్ ఓపెన్ కావ‌డం లేదంటూ వినియోగ‌దారులు కంప్లైట్ చేశారు. గూగుల్‌లో సెర్చ్‌ చేసే సమయంలో గూగుల్‌ సర్వర్‌లో 502 ఎర్రర్‌ డిస్‌ప్లే అవుతోంద‌ని, టెంపరరీగా ఆగిపోవడంతో పాటు ప్లీజ్‌ ట్రై ఎగైన్‌ ఇన్‌ 30 సెకెండ్స్‌ అని చూపిస్తోంద‌న్నారు.

"ఇంటర్నల్‌ సర్వర్‌లలో అంతరాయం ఏర్పడించింది. మీ రిక్వెస్ట్‌ను ప్రాసెసింగ్‌ చేస్తున్నాం" అంటూ రిప్లైలు రావ‌డంతో యూజ‌ర్లు మండిపడ్డారు. ప్ర‌స్తుతం తాము వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌లో ఉన్నామ‌ని వెంట‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు. అదే స‌మ‌యంలో గూగుల్‌ ట్రెండ్స్‌ విభాగం ఓపెన్‌ చేసేందుకు యత్నించ‌గా..అందులో బ్లాంక్‌ పేజ్‌ కనిపించడంతో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన యూజర్లు గూగుల్‌ పనిచేయడం లేదంటూ ఆ సంస్థకు వరుస ట్వీట్‌లు చేస్తున్నారు. ఇంకొంద‌రు మీమ్స్ తో ఆడుకున్నారు. ప్ర‌స్తుతం ఆ మీమ్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇదిలాఉంటే.. కొంత స‌మ‌యం త‌రువాత సేవ‌లు పున‌రుద్ద‌రించ‌బ‌డ్డాయి.అయితే అంతరాయంపై గూగుల్‌ అధికారికంగా స్పందించలేదు.


Next Story