మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.270 తగ్గి రూ.72,770కి చేరింది.
By అంజి
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. ఆగస్టు 28న, 10 గ్రాముల 24 క్యారెట్ల, 22 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.73,250, రూ.67,150గా ఉన్నాయి. ఆ రోజు నుండి వరుసగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
గడిచిన ఐదు రోజుల్లో ధరలు రూ.73,000 దిగువకు పడిపోయాయి. ఇవాళ కూడా హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.270 తగ్గి రూ.72,770కి చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.250 తగ్గి రూ.66,700కు చేరింది. అటు కేజీ వెండి ధర రూ.1000 తగ్గి రూ.91 వేలు పలుకుతోంది.
నేడు దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల, 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.72920, రూ.66850గా ఉన్నాయి.
నేడు కోల్‌కతాలో 10 గ్రాముల 24 క్యారెట్ల, 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.72770, రూ.66700గా ఉన్నాయి.
నేడు చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల, 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.72770, రూ.66700గా ఉన్నాయి.
నేడు ముంబైలో10 గ్రాముల 24 క్యారెట్ల, 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.72770, రూ.66700గా ఉన్నాయి.
గత నెలలో బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ప్రకటన తర్వాత బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్, భారతదేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల భవిష్యత్తు దిశ ఎక్కువగా అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలలో ఫెడరల్ రిజర్వ్ రేట్లు, భౌగోళిక రాజకీయ స్థిరత్వం ఆధారపడి ఉంటుంది.