దేశీయంగా బంగారం ధర దిగి వస్తున్నాయి. గతంలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం దేశీయంగా మార్కెట్లో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.43,260 దగ్గర కొనసాగుతుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పు జరగలేదు. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,410 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,530 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,470 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,470 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,570 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,320 ఉంది. హైదరాబాద్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840 ఉంది.
వెండి పరుగులు
ఇక బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతుంటే తాజాగా వెండి ధర కిలోపై రూ.1300 పెరిగింది. ఇక దేశంలో ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,500 ఉండగా, ముంబైలో రూ.70,500 ఉంది. చెన్నైలో రూ.74,400, కోల్‌కతాలో రూ.70,500, బెంగళూరులో రూ.70,000, హైదరాబాద్‌లో రూ.74,400, విజయవాడలో రూ.74,400 ఉంది.