మళ్లీ పెరిగిన బంగారం ధరలు
Gold Rates Hike Today. కొన్ని రోజులుగా ఏకబాకుతున్న బంగారం ధర ప్రస్తుతం దిగివస్తోంది. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
By Medi Samrat Published on 21 Feb 2021 5:21 PM ISTకొన్ని రోజులుగా ఏకబాకుతున్న బంగారం ధర ప్రస్తుతం దిగివస్తోంది. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకుంటున్న మార్పులు, దేశీయంగా బంగారానికి డిమాండ్, అలాగే స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్‌లో బంగారం, వెండికి కస్టమ్స్ సుంకం తగ్గించడంతో పసిడి ధర గణనీయంగా తగ్గుతోంది. అయితే శనివారంతో పోలిస్తే ఆదివారం స్వల్పంగా పెరిగింది. దేశీయంగా నిన్నటితో పోల్చుకుంటే నేడు 10 గ్రాముల బంగారంపై రూ.250 మేర పెరిగింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రామలు ధర రూ.47,190 ఉంది. అలాగే ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రామలు ధర రూ.45,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,440 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,770 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,130 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,130 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,260 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,190, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,310 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 ఉంది.
వెండి ధరలు కిలో..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,800 ఉండగా, ఢిల్లీలో రూ.69,000, చెన్నైలో రూ.73,800, ముంబైలో రూ.69,000, బెంగళూరులో రూ.69,800, కోల్‌కతాలో రూ.69,000, విజయవాడలో రూ. 73,800 ఉంది.
కాగా, మార్కెట్ లో ఏర్పడే పరిస్థితుల బట్టి పసిడి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. కనుక వినియోగదారులు కొనుగోలు చేసే సమయంలో మార్కెట్ లో బంగారం ధరపై అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది.