మహిళలకు శుభవార్త.. రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర
Gold Rate on February 5th.మగువలకు నిజంగా ఇది శుభవార్త.వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది.
By తోట వంశీ కుమార్ Published on 5 Feb 2023 2:04 AM GMTమగువలకు నిజంగా ఇది శుభవార్త. గత కొద్ది రోజులుగా పెరుగుతూ పోతూ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధర ఎట్టకేలకు దిగి వస్తోంది. వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల పసిడి పై శనివారం రూ.540 తగ్గగా నేడు(ఆదివారం) రూ.700 తగ్గింది. పలు ప్రాంతాల్లో ఉండే డిమాండ్, రవాణా తదితర కారణాల వల్ల ధరల తగ్గుదల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,310
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,200
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,210
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల ధర రూ.57,160